//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జగ్గారెడ్డిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు...!

Category : state

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ఉత్తర మండలం మార్కెట్ పోలీసులు సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో హాజరుపరిచారు. ఫేక్ పాస్‌పోర్టులతో ముగ్గురు వ్యక్తులను జగ్గారెడ్డి అమెరికా పంపించినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మధ్యవర్తి మధుకు రూ.5 లక్షల నగదు ఇచ్చి పాస్‌పోర్టులు తయారు చేసిన కేసులో టాస్క్‌ఫోర్స్ ఆయన్ని అరెస్టు చేసి మార్కెట్‌ పోలీసులకు అప్పగించారు.

దీంతో జగ్గారెడ్డిని పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. 2004లో జగ్గారెడ్డి తనతో పాటు భార్య, పిల్లల పేరుమీద పాస్‌పోర్టులు తీసుకుని వేరొకరిని అమెరికా తీసుకెళ్లినట్లు గుర్తించామని డీసీపీ తెలిపారు. ఆయనతో పాటు వెళ్లింది ఎవరో గుర్తించాల్సి ఉందని.. వారు తెలంగాణకు చెందిన వారు మాత్రం కాదని స్పష్టం చేశారు.

సికింద్రాబాద్‌ మార్కెట్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ అంజయ్యకు వచ్చిన సమాచారం మేరకు దీనిపై కేసు నమోదు చేశామన్నారు. పాస్‌పోర్టులో జగ్గారెడ్డి భార్య పోటో, పిల్లల పుట్టిన తేదీలు మార్పిడి జరిగిందని తెలిపారు. అక్రమంగా తరలించిన ముగ్గురి నుంచి జగ్గారెడ్డి లక్షల్లో వసూలు చేసినట్లు గుర్తించామని.. ఆ విషయాన్ని ఆయన కూడా అంగీకరించారని డీసీపీ తెలిపారు. ఆయనపై అధికార దుర్వినయోగం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు ,

Related News