//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జయలలిత ఇంట్లోకెళ్ళబోయిన దీపను అడ్డుకున్న పోలీస్ లు

Category : national

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం `వేదనిలయం' లోకి వెళ్లేందుకు ఆమె మేనకోడలు దీప  ప్రయత్నించగా ఆదివారం పోలీస్ లు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోయెస్‌ గార్డెన్‌ వద్ద గల ఇంటికి ఆమె చేరుకోగా దీప మద్దతుదారులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీప జయలలిత వారసురాలని ఆమెను అడ్డుకోవడం సరికాదని దీప మద్దతుదారులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జయలలిత మృతిచెందిన తర్వాత పోయెస్‌ గార్డెన్స్‌లో ఆమె సన్నిహితురాలు శశికళ ఉన్నారు. అయితే ఆమె జైలుకెళ్లిన తర్వాత ఆ భవనాన్ని ‘అమ్మ’ స్మారకంగా మార్చాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం డిమాండ్‌ చేశారు. మరోవైపు జయలలిత ఆస్తికి తానే వారసురాలినని, పోయెస్‌ గార్డెన్స్‌ తనకే దక్కుతుందని దీప డిమాండ్‌ చేస్తున్నారు.

జయలలితకు అధికారికంగా వారసులు లేకపోవడంతో ఆమె ఆస్తులు ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. పోయెస్‌ గార్డెన్‌లోని ఆమె ‘వేదవల్లి’ నివాసం కూడా సర్కారు అధీనంలోనే ఉంది. అయితే, ఈ నివాసాన్ని తాను స్వాధీనం చేసుకుంటానని, తనను నివాసంలో ఉండేందుకు అనుమతించాలంటూ దీప ఆదివారం హల్‌చల్‌ చేశారు. 

తన అనుచరులతో వచ్చి నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. జయలలిత ఆస్తులు తమకే దక్కాలని, జయలలిత వారసులను ఇంటిలోకి వెళ్లకుండా అనుమతించడం సరికాదని దీప ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆమె సోదరుకు దీపక్ సహితం అడ్డుకోవడం ఆసక్తి కలిగిస్తుంది. దినకరన్ అనుచరులు తనపై దాడికి ప్రయత్నం చేశారని దీప ఆరోపించారు. తనకు ప్రధాని నరేంద్ర మోడీ ని కలసి జయలలిత మృతిపై దర్యాప్తు చేయమని కొరగలనని ఆమె ప్రకటించారు.