//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గాలి ఇంటిలో సోదాలకు వెళ్లిన‌ పోలీసులకు షాక్..!

Category : politics

మైనింగ్ డాన్ గాలి జ‌నార్ధ‌న్‌రెడ్డి గాలింపు ముమ్మ‌ర‌మైంది. బెంగ‌ళూరు సెంట్ర‌ల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి కోసం జ‌ల్లెడ‌ప‌డుతున్నారు. రూ.600 కోట్ల కుంభ‌కోణం కేసులో ఇరుక్కున్న నిందితుల‌ను కాపాడేందుకు గాలి జ‌నార్ధ‌న్‌రెడ్డి రూ.21 కోట్లను ముడుపుల రూపంలో తీసుకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై గాలి జ‌నార్ధ‌న్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. తాజాగా, బ‌ళ్లారిలోని గాలి జ‌నార్ధ‌న్‌రెడ్డి నివాసంలో విస్తృత సోదాలు జ‌రుగుతున్నాయి. Police on look out for Absconding Gali Janardhan Reddy in Bribery Case

వాస్త‌వానికి 2017లో బెంగ‌ళూరు బీజేహ‌ల్ పోలీసు స్టేష‌న్‌లో ఈ కేసు విచార‌ణ బాధ్య‌త కొంత‌కాలంపాటు ఈడీ విచారించి, ఆ త‌రువాత సిటీ క్రైమ్ బ్రాంచ్‌కు అప్ప‌గించింది. తాజాగా, తీగ లాగితే డొంక క‌దిలిన‌ట్టు గాలి జ‌నార్ధ‌న్‌రెడ్డి కేసులో నిందితుల‌ను కేసు నుంచి త‌ప్పించేందుకు అంబిడెండ్ అనే కంపెనీ నుంచి రూ.21 కోట్ల‌ను 51 కిలోల బంగారం రూపంలో ముడుపుల‌ను స్వీక‌రించిన‌ట్టు తేల‌డంతో ఆయ‌న‌పై కేసు న‌మోదైంది. దీంతో, అప్ప‌ట్నుంచి ప‌రారీలో ఉన్న గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి కోసం సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గాలిస్తున్నారు. Police on look out for Absconding Gali Janardhan Reddy in Bribery Case

బెంగ‌ళూరు, బ‌ళ్లారి, ఓఎంసీ స‌హా హైద‌రాబాద్‌లోని ప‌లు చోట్లలో గ‌ల గాలి జనార్ధ‌న్‌రెడ్డి డెన్‌ల‌లో బెంగ‌ళూరు సెంట్ర‌ల్ క్రైమ్ బ్రాంచ్ బృందాలు త‌నిఖీలు చేస్తున్నాయి. ఈ త‌నిఖీల‌లో అనేక కీల‌క డాక్యుమెంట్ల‌ను స్వాదీనం చేసుకున్న‌ట్టు త‌లుస్తుంది. బెంగ‌ళూరులోని చాళుక్య స‌ర్కిల్‌లో ఉండే గాలి నివాసం పారిజాతం స‌హా ఓబులాపురం మైనింగ్ కంపెనీలోనూ సోదాలు జ‌రుగుతున్నాయి.Police on look out for Absconding Gali Janardhan Reddy in Bribery Case

అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు పోలీసులు నిర్వ‌హించిన సోదాల్లో గాలి జ‌నార్ధ‌న్ అక్ర‌మ వ్యాపార లావాదేవీల‌కు సంబంధించిన రికార్డులు బ‌య‌ట‌ప‌డ్డాయి. అంతేకాకుండా, గాలి జ‌నార్ధ‌న్‌రెడ్డికి చెందిన ప‌లు ఇళ్ల‌ల్లో గోడ‌ల మ‌ధ్య లాక‌ర్లు ఉన్న‌ట్టు పోలీసులు గుర్తించారు. వాటిని ప‌గ‌ల‌గొట్టి గాలి జ‌నార్ద‌న్‌రెడ్డికి సంబంధించిన ఆస్తుల ప‌త్రాల‌తోపాటు డ్ర‌గ్స్‌, పేలుడు ప‌దార్థాల‌ను స్వాధీనం చేసుకున్నారు. మ‌రో ప‌క్క‌, గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి ప‌ర్స‌న్ అసిస్టెంట్ అలీ ఖాన్ ఇళ్ల‌ల్లోనూ పోలీసులు ముమ్మర త‌నిఖీలు చేశారు. అలీఖాన్ ఇంటిలోనూ గాలికి సంబంధించిన ఆస్తి రికార్డుల‌ను, పేలుడు ప‌దార్థాల‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.Police on look out for Absconding Gali Janardhan Reddy in Bribery Case

ఇదిలా ఉంగా, రెండు రోజుల‌పాటు త‌మ సోదాల్లో గాలి జ‌నార్ధ‌న్‌రెడ్డి ఆచూకి ల‌భించ‌క‌పోవ‌డంతో విజ‌య్ మాల్యా, నీర‌వ్ మోడీ త‌ర‌హాలోనూ గాలి జానార్ధ‌న్‌రెడ్డి కూడా దేశాన్ని విడిచి వెళ్లాడా..? అన్న కోణంలోనూ పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. అందులో భాగంగా ఇటీవ‌ల విదేశీ ప్ర‌యాణం చేసిన వారి లిస్టును కూడా పోలీసులు ప‌రిశీలిస్తున్నారు.Police on look out for Absconding Gali Janardhan Reddy in Bribery Case

Related News