//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

క్రికెటర్ భార్యను కొట్టిన పోలీస్

Category : sports

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వీరంగం సృష్టించాడు ఒక కానిస్టేబుల్. ఏకంగా ఒక క్రికెటర్ భార్యనే జుట్టుపట్టుకుని లాగి కొట్టాడు. వివరాల్లోకి వెళితే భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రీవా జడేజా కారు గుజరాత్ జామ్నగర్ లోని సరు సెక్షన్‌ రోడ్‌లో ప్రమాదవశాత్తూ కానిస్టేబుల్‌ బైక్‌ను స్వల్పంగా ఢీకొంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. కానీ కానిస్టేబుల్‌ మాత్రం వీరంగం సృష్టించాడు.

రీవాను జుట్టు పట్టిలాగి దుర్భాషలాడాడు. దీనిపై స్పందించిన జామ్‌నగర్‌ ఎస్పీ ప్రదీప్‌ ‘కారు ఢీకొట్టడంతో ఆగ్రహించిన కానిస్టేబుల్‌ జడేజా భార్యపై చేయిచేసుకొని దుర్భాషలాడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారమందిన వెంటనే రీవాను తమ నివాసానికి పంపాం. వీరంగం సృష్టించిన కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నాం. అతనిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని వెల్లడించారు.