Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాశ్మీర్ ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నామని ప్రధాని స్పష్టం

Posted 5 months ago | Category : national


జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంలో కలిసి అక్కడి ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తూ కశ్మీర్‌ అభివృద్ధి, ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ దేశం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. కొన్ని సమస్యలు ఆరోపణలు, తుపాకులతో పరిష్కారం కావని అంటూ  ప్రజలు ఒకరికొకరు మమేకమైనప్పుడే సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ప్రజలంతా భుజం కలిపినప్పుడే శత్రువును సమర్థంగా ఎదుర్కోగలమని పేర్కొన్నారు.

దేశంలోని యువత కొత్త సంకల్పంతో ముందుకెళ్లాలని అంటూ 21వ శతాబ్ధంలో జన్మించిన నవ యువకులకు ఈ జనవరి 1 కొత్త అవకాశాన్ని ఇస్తుందని చెప్పారు. ఈ శతాబ్ధిలో జన్మించిన నవ యువత మొదటిసారి ఓటు హక్కు సాధించుకోబోతున్నదని గుర్తు చేశారు. దేశ ప్రగతిని కొత్త దిశగా నడిపించే అవకాశం యువతకు వస్తుందని చెబుతూ నిరాశ నిస్కృహలను వీడి యువత ముందడుగు వేయాలని ప్రధాని నిర్దేశించారు.

ఈ దేశం నిజాయితీ పరులదని, అవినీతి పరులు, అక్రమార్కులకు స్థానం లేదని ప్రధాని స్పష్టం చేశారు. క్విట్ ఇండియా ఉద్యమానికి 75ఏళ్లు పూర్తయ్యాయి. స్వరాజ్యం నా జన్మహక్కు అని తిలక్ ప్రారంభించిన గణపతి ఉత్సవాలకు 125 ఏళ్లు పూర్తయ్యాయని ప్రధాని చెప్పారు. ఒక వ్యక్తి ఏదీ చేయలేడని, అదే సమిష్టిగా ఎంతైనా సాధించగలడని ప్రధాని అన్నారు.

శ్రీకృష్ణుడు, రామచంద్రుడు మనకు ఆదర్శ పురుషులు. ఆలమందను కాపాడేందుకు శ్రీకృష్ణుడు గోవర్దన గిరి ఎత్తాడు. వానర సమూహం సాయంతో సముద్రంపై రాముడు సేను నిర్మించారు. 125 కోట్ల భారతీయులందరం ఒక్కటై కొత్త సంకల్పంతో ఏదైనా సాధించవచ్చని తెలిపారు.

జీఎస్టీని తీసుకొచ్చి సహకార సమాఖ్య వ్యవస్థకు కొత్త జవసత్వాలు అందించామని చెబుతూ తక్కువ సమయంలో జీఎస్టీ ఎలా అమలు చేశారని ప్రపంచం ఆశ్చర్యపోతున్నదని ప్రధాని తెలిపారు. భారతదేశంలో నిబద్ధత, సాంకేతికతలో ఉన్న నైపుణ్యత జీఎస్టీని సుసాధ్యం చేసిందని ప్రధాని వెల్లడించారు. దేశంలోని మూలమూలకు విద్యుత్ వెలుగులు ప్రసరిస్తున్నాయి. ఇంటింటికీ గ్యాస్ పొయ్యిల ద్వారా కోట్లాది పేద మహిళలకు పొగ నుంచి విముక్తి కలిగిందని వివరించారు.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted an hour ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే