//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఫేస్ బుక్ లో మోడీ నెం.1 స్ధానం

Category : politics

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సోష‌ల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. నిత్యం ఫేక్ బుక్, ట్వీట్ట‌ర్ ల‌లో పోస్టులు పెడుతుంటారు. ఇటివ‌లే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కి అరుదైన ఘ‌న‌త ల‌భించింది. ఫేక్ బుక్ అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన వ్య‌క్తిగా ప్రధాని మొద‌టిస్ధానంలో ఉన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో న‌రేంద్ర‌మోడీ సోష‌ల్ మీడియాల‌ను చాలా బాగా వాడుకున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా కూడా త‌ను ప్ర‌చారం చేశారు. ఈ రకంగా చేయ‌డం వల్ల విద్యార్దులు, యువ‌కులు, జాబ్ చేసేవాళ్లను ఎక్కువ‌గా టార్గెట్ చేశారు. ఈ విధంగా న‌రేంద్ర‌మోదీ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేసుకున్నారు.

ఇంత‌కుముందు ఫేస్ బుక్ ఫాలోవ‌ర్స్ లో మొద‌టిస్దానంలో అమెరికా అధ్య‌క్ష‌డు డొనాల్డ్ ట్రంప్ నెంబ‌ర్ వ‌న్ స్ధానంలో ఉండేవాడు. ఇపుడు ఆ ప్లేస్ ను న‌రేంద్ర మోదీ కైవ‌సం చేసుకున్నాడు. ఫేస్ బుక్ లో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన ప్ర‌పంచ‌నేత‌ల జాబితా ప్ర‌కారం ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ అగ్ర‌స్ధానంలో ఉన్న‌ట్టు బుర్స‌న్ కోహ్న్ అండ్ వోల్ఫే అనే సంస్ధ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఆ సంస్ధ విడుద‌ల చేసిన నివేదిక ప్ర‌కారం న‌రేంద్ర‌మోదీ 4.32కోట్ల మంది ఫాలోవ‌ర్ల‌తో మొద‌టిస్దానంలో నిలిచారు. ఆ త‌ర్వాత 2.31కోట్ల మంది ఫాలోవ‌ర్ల‌తో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండ‌వ స్దానంలో నిలిచాడు. ఫేస్ బుక్ క్రౌడ్ టాంగిల్ టూల్ నుంచి డేటాను ఉప‌యోగించి జ‌న‌వ‌రి1, 2017 నుంచి ఈ సర్వేను చేపట్టిన‌ట్టు తెలిపారు.

Related News