Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోదీ బయోపిక్ ఫస్ట్ లుక్...!

Category : movies

భారతీయ చలన చిత్ర రంగంలోనే మొట్ట మొదటి సారిగా జీవించి ఉండగానే ఒక ప్రధాన మంత్రి కి సంబంధించిన ఒక బయోపిక్ మూవీ రావడం విశేషం.ఈసినిమాకి సంబంధించి ముఖ్య ప్రధాన పాత్రలో బాలీవుడ్ ఆక్టర్ వివేక్‌ ఒబెరాయ్ నటిస్తున్నారు .అయితే ఈ సినిమా ఈ నెల 15 నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుందని . ఈ చిత్రాన్ని ఏక కాలంలో తెలుగు, తమిళం, హిందీ భాషలతో కలిపి దాదాపు 23 భాషల్లో విడుదల చేయబోతున్నారట పైగా 23 భాషల్లో డిజైన్‌ చేసిన ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ విడుదల చేయడం జరిగింది . ఈ చిత్రాన్ని వివేక్‌ తండ్రి సురేశ్‌ ఒబెరాయ్‌, సందీప్‌ సింగ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ పోస్టర్‌పై ‘దేశ భక్తే నా శక్తి’ అన్న క్యాప్షన్‌ తో ఎంతో ఆసక్తికరంగా ఉంది.

ఈ బయోపిక్‌కు ‘పీఎం నరేంద్రమోదీ’ అనే తెలుగు టైటిల్‌ను రిలీజ్ చేయగా .ఈ సినిమా కి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూసినట్లతే అందులో మోదీ గెటప్ లో వివేక్ ఒబెరాయ్ చాల ఇంప్రెస్సివ్ గా ఉన్నాడు. మోదీ మేనరిజంతో అట్రాక్టీవ్ గా ఉంది .ఈ చిత్రానికి ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఈరోజు విడుదల చేయడం జరిగింది . ఇంకా ఈ బయోపిక్‌కు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం త్వరలో ప్రకటించనుంది