//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

2018 లో మోడీ ప్లాన్స్ ఇవే !

Category : editorial

హిమాచల్ ప్రదేశ్ లో భారీ విజయం, గుజరాత్ లో బొటాబొటి విజయం సాధించి ఊపు మీదున్న మోది నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? లోక్ సభ ఎన్నికలకి ఎలా సిద్ధం కాబోతున్నారు అంటే.. లోక్ సభ ఎన్నికలకి ముందు మోది మూడు రాష్ట్రాలలో కఠినమైన ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉంది. కర్ణాటక అసెంబ్లీ కి 2018 మే లో, రాజస్తాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీలకి డిసెంబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉండవచ్చు. అందుకే మోడీ ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలు ఎదుర్కొనే బదులు, మోది వేరే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.

దేశమంతా లోక్ సభ ఎన్నికలతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ లకి కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. వన్ నేషన్ వన్ ఎలెక్షన్ అన్నమాట. దీనికి ముందు..మోది 4 పనులు చేసే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే మధ్యతరగతి పేద ప్రజలకి మరింత దగ్గర అయ్యేందుకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ లని GST పరిధిలోకి తీసుకురావడం. పెట్రోల్ లీటర్ 50 లోపే ఉండేలా చూసుకోవడం.

గ్రామీణ ప్రాంతాల్లో బిజెపి పై వ్యతిరేకత ఉందని గుజరాత్ ఫలితాలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో గ్రామీణ భారతానికి, ముఖ్యంగా వ్యవసాయానికి ఊతం ఇచ్చేలా వచ్చే బడ్జెట్ భారీ పథకం ఒకటి ప్రవేశ పెడతారని తెలుస్తోంది. ఇక అయోధ్యలో రామమందిరం నిర్మాణం పనులు ఊపందుకోవచ్చు. ఇక్కడ ఆలయం నిర్మించినా బిజెపి కి రాజకీయంగా లాభమే, కనీసం పని మొదలు బెట్టి వివాదాస్పదం అయినా బిజెపి కి లాభమే. కాబట్టి వచ్చే డిసెంబర్ లోపు అయోధ్యలో రామమందిరం నిర్మాణం చేపట్టవచ్చు.

దేశంలో ఎమోషన్స్ పెంచి, దేశభక్తి అనే ఊపు తీసుకొస్తే అధికార పార్టీ కి గెలుపు ఈజీ అవుతుంది. కాబట్టి పాకిస్తాన్ మీద సర్జికల్ స్త్రైక్స్ చేయడం కానీ చిన్నపాటి యుద్ధం చేయడం కానీ జరగవచ్చని అంటున్నారు. ఈ నాలుగు పనులు పూర్తి చేసి, 5 వ పనిగా “వన్ నేషన్ వన్ ఎలెక్షన్” కి మోది వెళతారని తెలుస్తోంది. దేశంలో 29 రాష్ట్రాలలో 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి పూనుకుంటే, రాజ్యాంగ సవరణ చేసి అయినా వన్ నేషన్ వన్ ఎలెక్షన్ కి వెళ్తారని అంటున్నారు. 2018 డిసెంబర్ లో జమిలి ఎన్నికలకి వెళ్ళేలా ఢిల్లీ లో కసరత్తులు జరుగుతున్నాయని సమాచారం. ఈ అయిదు పనులు చేస్తే ఎవరు ఎంత గింజుకున్నా, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా బిజెపి అత్యధిక లోక్ సభ స్థానాలు గెలవడం, మెజారిటీ రాష్ట్రాలలో అధికారంలోకి రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెపుతున్నారు.