//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సినీ ప్రముఖులకు మోడీ లేఖలు

Category : national

దర్శకధీరుడు రాజమౌళితో పాటు తెలుగు సినీ నటులు మోహన్‌బాబు, ప్రభాస్‌, మహేశ్‌బాబు తదితరులకు నరేంద్ర మోడీ ప్రత్యేక లేఖలు రాశారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘స్వచ్ఛతా హీ సేవా’ (స్వచ్ఛతే సేవ) కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మోడీ తన లేఖలో కోరారు. దేశంలో స్వచ్ఛత పెంపొందించడానికి కృషి చేయాలంటూ మోడీ పలువురు ప్రముఖులకు లేఖ రాస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్, మలయాళ నటుడు మోహన్‌లాల్‌కు కూడా మోడీ లేఖ రాశారు.

గాంధీజీ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది సమాజం పట్ల మనకున్న వైఖరిని ప్రతిబింబిస్తుంది. ఈ కార్యక్రమంలో మీరూ భాగస్వాములు అవుతూ, మరింత మంది పాల్గొనేలా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. స్వచ్ఛతే సేవ ఉద్యమం కోసం కొంత సమయాన్ని కేటాయించండి. బాపూకి మనమిచ్చే నిజమైన నివాళి ఇదే అని మోడీ తన లేఖలో పేర్కొన్నారు.స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ ప్రేరణగా నిలవాలని కోరారు. చివరగా ‘జైహింద్‌’ అంటూ తన లేఖను ముగించారు.