//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వాజ్‌ పేయీ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఎయిమ్స్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

Category : politics national state

బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న వాజ్ పేయీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పరామర్శించారు. వాజ్ పేయీ ఆరోగ్య పరిస్థితి గురించి, ఆయనకు అందిస్తున్న వైద్య సదుపాయాల గురించి మోదీ అడిగి తెలుసుకున్నారు. వాజ్ పేయీని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా పరామర్శించారు.

కాగా, కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వాజ్ పేయీ చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఇటీవల చేరారు. ఆయన ఆరోగ్యపరిస్థితి క్షీణించడంతో పార్టీ అగ్రనేతలు అధికారిక కార్యక్రమాలను వాయిదా వేసుకుని ఎయిమ్స్ కు చేరుకుంటున్న పార్టీ వర్గాల సమాచారం.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎయిమ్స్‌కు చేరుకున్నారు. భాజపా సీనియర్‌ నేత, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీని మోదీ పరామర్శించనున్నారు. గత కొంతకాలంగా దిల్లీ ఎయిమ్స్‌లో మూత్ర పిండాల వ్యాధితో వాజ్‌పేయీ చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఎయిమ్స్‌ చేరుకుని ఆయనను పరామర్శించారు. వాజ్‌పేయీ ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్‌ అధికారులు ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.