బంగ్లా ప్రధాని షేక్ హసీనా నాలుగు రోజుల భారత పర్యటనకై ఈరోజే భారతదేశం వచ్చింది. ఆమెను ఆహ్వానించటానికి ప్రధాని మోదీ తన బృందంతో ఏ విధమైన ట్రాఫిక్ ఆంక్షలు విధించకుండ సామాన్య పౌరుడిలా ప్రయాణం చేసి విమానాశ్రయం చేరుకున్నారని పి.టి.ఐ తెలిపింది. ఈ పర్యటనలో ఉభయదేశాల మధ్య పలు ఒప్పందాలు కుదరనున్నాయి. బంగ్లాదేశ్ కు భారతదేశం ఐదు బిలియన్ డాలర్లు ఆర్థిక సహాయం అందించనున్నదని సమాచారం.