//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

యోగ టీచర్ గ ప్రధాని మోడీ...!

Category : national

గత సంవత్సరం ప్రపంచ యోగా డేను ఘనంగా నిర్వహించారు ప్రధాని మోడీ.ఈ సంవత్సరం కూడా ప్రపంచ యోగ డేను మరింత ఘనంగా చేసేందుకు ప్రయతిన్స్తున్నారు మోడీ.అందుకు అయన ఈసంవత్సరం యోగ టీచర్ గ మనల్ని పలకరించనున్నారు.అందుకు అయన ఉన్న ఓ త్రీడీ యానిమేషన్‌ వీడియోను విడుదల చేశారు.

ఆదివారం 42వ మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ ఓ త్రీడి వీడియోను షేర్‌ చేశారు. అందులో త్రీకోణాసనం నేర్పిస్తున్న యోగా టీచర్‌గా మోదీ కనిపిస్తారు.ప్రధాని మాట్లాడుతూ.. ‘నేను యోగా టీచర్ను కాదు. కొంత మంది తమ ప్రతిభతో నన్ను ఇలా మార్చేశారు’ అని అన్నారు.

దేశ యువత ఫిట్‌ మూమెంట్‌ తెచ్చి దాన్ని విజయవంతం చేయాలని మోదీ పిలుపునిచ్చారు.