//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జూన్ 28న, నా వివాహం దయచేసి నన్ను ఈ పరీక్షల్లో పాస్ చేయండి

Category : national

పబ్లిక్ పరీక్షల్లో పాస్ అయ్యేందుకు విద్యార్థులు పడరానిపాట్లు పడుతు పక్క విద్యార్థుల నుండి చూచి రాయటం, చిట్టీలు పెట్టటం, ఇలా నానా తంటాలు పడుతుంటారు.అయితే ఎక్కువగా ఇలాంటి పనులన్నీ అబ్బాయిలే చేస్తుంటారు. కానీ ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థిని ఓ సరికొత్తగా ఆలోచన చేసింది.

పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నపత్రం చాలా కఠినంగా ఉండటంతో ఆన్సర్లు రాయలేక పోయింది. దీంతో తాను ఫెయిల్ కావడం తథ్యమనే నిర్ధారణకు వచ్చింది. అయితే, ఎలాగైనా ఈ పరీక్షల్లో పాస్ కావాలన్న ఉద్దేశ్యంతో జవాబు పత్రాలపై 'సార్ నేను ఓ అమ్మాయిని, వచ్చే జూన్ 28న, నా వివాహం జరగనుంది. దయచేసి నన్ను ఈ పరీక్షల్లో పాస్ చేయండంటూ' జవాబు పత్రం మీద రాసింది. తనను పాస్ చేయాలంటూ అభ్యర్థించింది. తాను ఫెయిల్ అయితే తమ కుటుంబమంతా బాధపడుతోందని ఆమె చెప్పుకొచ్చింది. తన పరిస్థితిని అర్థం చేసుకోండి అంటూ యూపీ బోర్డు ఎగ్జామ్ జవాబు పత్రాలపై ఆ విధ్యార్థిని ఇలా రాసింది.