//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గేమ్ ఆడి రష్యాలో 130 మంది టీనేజర్లు మృతి.

Category : world

అదో సోషల్‌ మీడియా గేమ్‌ పేరు బ్లూ వేల్‌,నిజానికి చెప్పాలంటే అది ఒక 'సైకో' గేమ్‌.ఈ గేమ్ ని మీ మొబైల్లో డౌన్‌లోడ్‌ చేసుకున్నారా ఇక అంతే సంగతి మీ ప్రాణాలమీదకు తెచ్చుకున్నట్లే. మొదట చిన్న చిన్న సవాళ్లను విసిరే ఈ గేమ్‌ చివరకు ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది.10-14 ఏళ్ల పిల్లల లక్ష్యంగా రూపొందించిన ఈ గేమ్‌ వారి భావోద్వేగాలతో ఆడుకుంటూ వారిని చంపేస్తోంది. నిజమేనండి ఇప్పటికే ఈ గేమ్ ఆడి రష్యాలో 130 మందికిపైగా టీనేజర్లను ఆత్మహత్య చేసుకున్నారు.ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు విస్తరిస్తుండగా దీనిపై పాఠశాలలు,పిల్లల తల్లిదండ్రులు, మానసిక నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మొదట చిన్న చిన్న టాస్క్‌లు ఇస్తుంది ఆ గేమ్ ఆ టాస్క్‌లను పూర్తి చేసి దాని తాలూకు ఫొటోలను షేర్‌ చేయాలి. ఇలా ఒకటి రెండు రోజులు అలవాటయ్యాక గేమ్‌ స్థానంలో ‘మెంటర్‌’ ఎంటర్‌ అవుతాడు. అప్పటి నుంచి అసలైన మృత్యు‘క్రీడ’ మొదలవుతుంది. భయంగొలిపే చలన చిత్రాలను చూడమంటాడు. అర్ధరాత్రి అని లేకుంటే గాఢనిద్రలో ఉన్న సమయంలో లేవాలని ఆదేశిస్తాడు. చర్మంపై కత్తితో కొన్ని బొమ్మల ఆకారాలను గీసుకోమంటాడు. సరదాగా నగ్న చిత్రాలను షేర్‌ చేయమంటాడు. బాయ్‌,గర్ల్‌ ఫ్రెండ్‌తో డేటింగ్‌ చేయమని ప్రేరేపించి.సాక్ష్యం కోసం చిత్రాలను, వీడియోలను అడుగుతాడు. అతను ఇలా టీనేజర్లతో తప్పుపై తప్పులు చేయిస్తూ వెళ్తాడు. ఆ గేమ్‌ ఆడే టీనేజర్లు అది గేమ్‌లో భాగమనుకుంటారు తప్ప వెనుక మెంటర్‌ ఉన్న సంగతి తెలుసుకోలేరు. ఇలా రోజుకో టాస్క్‌ ఇస్తూ 49 రోజులు తరవాత, 50వ రోజు ఆత్మహత్య చేసుకోమని ఆ మెంటర్‌ ప్రేరేపిస్తాడు.అప్పుడే గేమ్‌ ముగుస్తుందని చెబుతాడు ఈ గేమ్‌ టీనేజర్లను పూర్తిగా హిప్నటైజ్‌ చేసి వారిని కాల్పనిక ప్రపంచంలోకి తీసుకెళ్తుంది అసలు ఏది నిజమో,ఏది కలో కూడా అర్థంకాని స్థితికి చేర్చుతుంది చివరకు పిచ్చిగా మార్చి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుంది.చూసారా ఈ 'సైకో' గేమ్‌ వినటానికి ఎంత భయంకరంగా ఉందొ అంతే కాదు ఈ గేమ్ ఫై బ్రిటన్‌, దుబాయ్‌, అమెరికా ఇలా చాలా దేశాల్లో ఆందోళన చెందుతున్నారు .

ఈ గేమ్‌ను సృష్టించిన ఫిలిప్‌ బుడేకిన్‌ అనే వ్యక్తిని ఇటీవలే అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు అనుకోండి. అతను ఒక మానసిక రోగి కావడంతో సైకియాట్రిక్‌ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ గేమ్‌ వెనుక కేవలం ఫిలిప్‌ మాత్రమే ఉన్నారా లేక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.సంతోష కరమైన విషయం ఏమిటి అంటే ఈ గేమ్ మన భారత దేశంలోకి ప్రవేశించలేదు,అదే జరిగి ఉంటె రష్యా దేశం లాగా మన టీనేజర్లు కూడా బలి అయ్యేవారు