//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టెర్రర్ సృష్టిస్తున్న "ప్లాస్టిక్ ఆహారం" పోస్టింగ్స్

Category : editorial

సోషల్ మీడియాలో, ముఖ్యంగా యూట్యూబ్ లో "ప్లాస్టిక్ ఆహారం" గురించి లెక్కకు లేనన్ని పోస్టింగ్ లు వస్తున్నాయి. "ప్లాస్టిక్ బియ్యం", "ప్లాస్టిక్ గ్రుడ్లు", "ప్లాస్టిక్ క్యాబేజి" వంటి పలు కధనాలు విశేషంగా ప్రచారంలోకి వస్తూ ఉండడం వినియోగదారులలో టెర్రర్ కలిగిస్తున్నది.  

దానితో అధికారులు దేశంలో పలుచోట్ల షాప్ లపై  దాడులు జరపడం, అరెస్ట్ లు చేయడం, ఆహార పదార్ధాలను రసాయనిక పరీక్షలకు పంపడం చేస్తున్నారు. గత మార్చ్ లో "కృత్రిమ గ్రుడ్లు" అమ్ముతున్న ఒక వ్యక్తిని కొలకత్తాలో అరెస్ట్ చేయగా, గత నెల హైదరాబాద్ లో "ప్లాస్టిక్ బియ్యం", "ప్లాస్టిక్ పాలు" అమ్ముతున్న 30 మందిని అరెస్ట్ చేశారు. 

అధికారులు హైదరాబాద్ లో వండిన బియ్యాన్ని స్వాధీనం  చేసుకొని, ఆ బియ్యం అమ్మిన షాప్ లపై దాడులు జరిపి వాటిని రసాయనిక  పరీక్షకు పంపారు. ఉత్తరాఖండ్ మార్కెట్ లో "ప్లాస్టిక్ బియ్యం"ను బహిరంగంగా అమ్ముతున్నట్లు జూన్ 7న ఒక ఆంగ్ల పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. 

సోషల్ మీడియా లో ప్లాస్టిక్ ఆహార పదార్ధాల గురించి కధనాలు చుసిన తరువాత జూన్ 9 న కర్ణాటక ప్రభుత్వం దర్యాప్తు కు ఆదేశించింది.అటువంటి కథనాలతో ఏప్రిల్ లో కోయంబత్తూర్ లో అధికారులు మార్కెట్ లో గుడ్లు నమూనాలను సేకరించారు. అయితే ఇటువంటి కథనాలను ఢిల్లీ ప్రభుత్వం కొట్టిపారవేసింది. 

ఈ విధంగా ప్లాస్టిక్ ఆహార వస్తువులపై సోషల్ మీడియా లో వీడియోలు, పోస్టింగ్ లు వస్తూ ఉండడం ప్రజలు భయకంపితులవుతున్నారు. కానీ దేశంలో ఎక్కడ కూడా అటువంటి  కధనాలు యదార్ధమని స్పష్టం కాకపోవడం గమనార్హం . 

Related News