//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వారి కోసం ఎన్నడు లేని విధంగా పధకాలు

Category : district state

గతంలో ఎన్నడూ లేని విధంగా మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలుచేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. సబ్సిడీపై వివిధ పరికరాలను మత్స్యకారులకు అందించే కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక టౌన్‌హాల్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. వలలు, మోపెడ్లు, జీపీఎస్‌ సెట్లు, తదితరాలను ప్రభుత్వం 75 శాతం సబ్సిడీపై అందచేస్తోందన్నారు.

ప్రతి ఒక్కరూ చంద్రన్న బీమా నమోదు చేయించుకోవాలని సూచించారు. మత్స్యకారుల భూముల్లో సాగు చేసుకునేందుకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నట్టు తెలిపారు. సముద్రంలో వేటకు ఉపయోగించే స్టీల్‌బోట్‌లను 50 శాతం సబ్సిడీతో అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనీ, రూ.80 లక్షలు విలువ చేసే బోట్‌ కోసం ప్రాజెక్టు రిపోర్ట్‌తో సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో భాగంగా రూ.73 లక్షల విలువైన వలలు, మోపెడ్లు, తదితరాలను 205 మంది లబ్ధిదారులకు మంత్రి అందజేశారు.