//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రష్యాలో కూలిన విమానం

Category : national

ఈ మధ్య కాలం లో విమాన ప్రమాదాలు మరీ ఎక్కువై పోయాయి. రష్యాలో 65 మంది ప్రయాణికులతో వెళుతున్న విమానం ఒకటి కూలిపోయింది. రాజధాని మాస్కోలోని విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది.

ఆరుగురు విమాన సిబ్బంది, ప్రయాణికులు బతికి బయటపడే అవకాశం లేదని భావిస్తున్నారు. ఓర్స్క్‌ నగరానికి వెళుతుండగా మాస్కోకు చేరువలోని రేమన్‌స్కై జిల్లాలో ప్రమాదానికి గురైంది. మాస్కోలోని రెండో అతి పెద్ద విమానాశ్రయం డొమోదెదొవొ నుంచి టేకాఫ్‌ అయిన రెండు నిమిషాలకే రాడార్ల పరిధి నుంచి మాయమైంది. విమానం కాలుతూ పడిపోవడాన్ని చూశామని ఆ ప్రాంతానికి చెందిన పలువురు తెలిపారు.

విమాన శకలాలు సుదూర ప్రాంతాల్లో సైతం పడ్డాయి. వాహనాల్లో ఘటనా స్థలానికి చేరుకోవడం అసాధ్యంగా ఉంది. దీంతో 150 మంది సహాయక సిబ్బంది కాలినడకనే వెళ్లారు. రష్యాలో ఇటీవల రికార్డుస్థాయి హిమపాతం నమోదువుతోంది. ప్రమాదానికి కారణం వాతావరణ పరిస్థితులా, మానవ తప్పిదమా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

ప్రమాదానికి గురైన విమానం అంటొనొవ్‌ యాన్‌-148 రష్యాకు చెందిన సరతొవ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందినది. ఏడేళ్ల కిందట రష్యాలోనే తయారైంది. ఏడాది కిందటే మరో సంస్థ నుంచి సరతొవ్‌ ఎయిర్‌లైన్స్‌ కొనుగోలు చేసింది.

ప్రమాదంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కాలం చెల్లిన విమానాలను నడుపుతుండడంతో రష్యాలో ఈ తరహా ప్రమాదాలు తరచు జరుగుతున్నాయి.