//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జనసేన కార్యకర్తలు చేసిన పనికి షాక్ లో పవన్ కళ్యాణ్ !

Category : politics

పవన్ కల్యాణ్ అభిమానులమంటూ, జనసేన పార్టీ నాయకులమంటూ ఓ యువతిని ఏడుగురు యువకులు మోసం చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే ఏలూరు వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన ఓ బంగారు వ్యాపారి కుమార్తెతో తాము పవన్ కల్యాణ్ అభిమానులమంటూ కొందరు యువకులు ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకున్నారు. అలాగే జనసేన పార్టీ‌లో తాము నాయకులమని.. పవన్ కల్యాణ్‌తో మీకు పరిచయం ఏర్పాటు చేస్తామని నమ్మబలికారు. కొద్దిరోజులు అలా ఛాటింగ్‌తో ఆ యువతికి నమ్మకం కలిగించి, ఆ తర్వాత తమకి డబ్బు చాలా అవసరం ఉందని.. నగలు ఇస్తే కొద్దిరోజుల్లోనే తిరిగిచ్చేస్తామని తీసుకున్నారు.

ఆమె నగలు అడిగితే ముందు తీసుకున్న నగలను ఇవ్వాలంటే.. మరికొన్ని ఇవ్వాలంటూ బెదిరించి.. పెద్ద‌ఎత్తున ఆభరణాలు దోచుకున్నారు. ఈ క్రమంలో దాదాపు 3.5 కిలోల బంగారు ఆభరణాలను నిందితులు యువతి దగ్గర నుంచి తీసుకున్నారు. చివరికి తాను మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులకి ఫిర్యాదు చేయగా.. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్ని శుక్రవారం అరెస్టు చేసి.. వారి వద్ద నుంచి 3,424 గ్రాముల బంగారు నగలు, కారు, రెండు బైక్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ. 1.23 కోట్లు ఉంటుందని అంచనా.

ఇప్పుడిప్పుడే కాస్త కాస్తగా నిర్మితమవుతున్న పార్టీ పేరు చెప్పుకుని అభిమానులు ఇలా చేయడం పవన్ కి కాస్త షాక్ కలిగించే విషయమే. ఇప్పటికయినా అలంటి వారిని కట్టడి చేయకుంటే భవిష్యత్తులో పార్టీ పేరు చెడిపోయే ప్రమాదం ఉంది,

Related News