//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ ఒక్క కారణంతో వైసీపీకి గుడ్ బై చెప్పిన పీకే : కారణం ఇదే..

Category : politics

వైసీపీ పార్టీ వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీని వదిలి వెళ్ళిపోయాడు. పీకే వైసీపీ పార్టీకి లోకి రాకముందు 2014 ఎన్నికలలో బీజేపీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి ఆ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషిచాడు. 2015లో ప్రధాని కార్యాలయం నుంచి బయటకు వచ్చాక వైసీపీ నేత జగన్ అభ్యర్థనమేరకు వైసీపీ లో చేరి పార్టీ వ్యూహకర్తగా పనిచేస్తున్నట్లు కిషోర్ తెలిపారు.

2019 ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్ వ్యూహం ప్రకారమే బీజేపీ-వైసీపీ కలిసి పనిచేయబోతున్నాయని దీనిలో భాగంగా బీజేపీ మొదట వైసీపీ వ్యూహకర్తగా కిషోర్ను రంగంలోకి దించారని సమాచారం. ప్రశాంత్ కిషోర్ అండ్ టీమ్ ఏపీ రాజకీయాలపై ఇప్పటికే ఓ నివేదిక కూడా ఇచ్చేసిందని ప్రచారం సాగుతోంది.

ప్రజలలో చంద్రబాబుకు ఉన్న క్రేజ్ తగ్గి అందరూ వైసీపీ వైపు చూస్తున్నారని పీకే ఇచ్చిన రిపోర్ట్ తో బీజేపీ పార్టీ బాబును వదిలి వైసీపీ కి దగ్గర అవుతుందని అప్పటి సమాచారం. అందుకే బీజేపీ టీడీపీ ని వదిలి వైసీపీకి దగ్గరైంది, అధికారికంగా వెల్లడించనప్పటికీ ఇదే నిజమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే తాజాగా ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్ట్ తో వైసీపీ పార్టీకి షాక్ తగిలింది. దీనితో సర్వే రిపోర్ట్ జగన్ కి ఇచ్చి పీకే గుజరాత్ వెళ్లాడని సమాచారం.

పీకే తాజా సర్వే తో ఏపీ లో మళ్ళి టీడీపీ పార్టీనే అధికారంలోకి వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం జగన్ ప్రజల సమస్యల పై అధికార పార్టీతో పోరాడకుండా అసెంబ్లీలో సమావేశాలకు డుమ్మా కొట్టడం, సీఎం చేస్తేనే మీ కోరికలు నెరవేరుస్తాననడం, అధికార పార్టీ చేసే ప్రతి సేవ కార్యక్రమాలకి అడ్డుపడటం చూసి ప్రజలు వైసీపీ పార్టీ పై విసుగు చెందారని అది టీడీపీ కి ప్లస్ అయ్యుందని, 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆ సర్వే చెప్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే ప్రశాంత్ కిషోర్ వైసీపీ ని వదిలి వెళ్లారని తాజా సమాచారం.