//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జనసేన ఫై పీకే టీం ఫీడ్ బ్యాక్...!

Category : politics

ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఎటు వేపుకు వెళ్తున్నాయో ఎవరికి అంతుచిక్కడం లేదు.ఏపీ లో ఇప్పుడున్న ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ , కాంగ్రెస్ మాత్రం ఆంధ్ర రాష్ట్ర విభజన అనంతరం ఏపీ లో కనుమరుగైపోయింది. ఇవి కాక నాకు పదవులు ముఖ్యం కాదు, ప్రజల సమస్యలే ముఖ్యం అనే నినాదం తో రాజకీయాలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన అసలు ఏపీ లో ఉందా అనే ప్రశ్నను అందరిలోనూ పుట్టిస్తుంది.

గత సార్వత్రిక ఎన్నికల టైం లో వెలుగు లో కి వచ్చిన జనసేన పార్టీ, ఈ సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ మరియు టీడీపీ కూటమికి మద్దతు గా నిలిచింది. ఎన్నికలలో ఆ పార్టీ లు గెలుపొందడంతో పవన్ కళ్యాణ్ కు కూడా కొంతమేర క్రెడిట్ ఇచ్చారు.

ఓట్ల శాతంలో తెలుగుదేశం కూటమి, జగన్ పార్టీల మధ్య తేడా స్వల్వమే అని అందరికి తెలుసు. ఆ స్వల్పమైన తేడా కు కారణం పవన్ కల్యాణే అనే వెర్రి లాజిక్ ఒకటి వినిపించడం జరిగింది. ఒకవేళ టీడీపీ పవన్ కళ్యాణ్ వల్ల గెలిచి ఉంటే అదే తెలుగుదేశం పార్టీ పవన్ సహాయం లేకుండా మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం సాధించింది. ఈ విషయం గురించి ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ ఎంత మేర ఏపీ రాజకీయాలలో ప్రభావం చూపుతున్నాడనేది తెలుస్తుంది.

ఇది ఆలా ఉంచితే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో జనసేన ప్రభావం ఆలా ఉంటుంది అని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఒక సర్వ్ నిర్వహించారు. ఆ సర్వే లో ఆసక్తికర విషయం ఏమి తేలిందంటే జనసేన అనే పార్టీ ఒకటి ఏపీ లో వున్నది అని ఆంధ్ర రురల్ ఏరియా లలో అసలు తెలియదంట.

పవన్ కల్యాణ్ పార్టీ గురించి పేపర్లు, వెబ్ సైట్లు రాసుకోవడం, సోషల్ మీడియాలో పెయిడ్ పేజెస్ రన్ కావడమే కానీ, సామాన్య ప్రజానీకానికి పవన్ పార్టీ ఒకటుందనేది తెలియదనేది ప్రశాంత్ కిషోర్ సర్వే ఫీడ్ బ్యాక్.

వచ్చే ఎన్నికలలోపు జనసేన పార్టీ ప్రచారం చేసుకోవచ్చునని ఆలా చేయని పక్షం లో జనసేన ఏపీ లో ఒక్క అసెంబ్లీ సీటుకూడా గెలవలేదు అని పీకే టీం సర్వ్ తేల్చి చెప్పింది. పవన్ కళ్యాణ్ రాయలసీమ లో కాదు కదా ఏపీ లో ఎక్కడి నుండి పోటీ చేసిన గెలిచే అవకాశం లేదని ప్రశాంత్ కిషోర్ సర్వే చెబుతుంది.

Related News