//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఐపీల్ పై హైకోర్టు లో పిల్‌..!

Category : sports

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరొక మూడు రోజులల్లో ఘనం గా ప్రారంభం కానున్నది. ఈ ప్రారంభ వేడుకలను ముంబై లో నిర్వహించనున్నారు. ఈ వేడుకలలో పలువురు బాలీవుడ్ నటులు పాల్గొననున్నారు. మొదటి మ్యాచ్ ముంబై కి చెన్నై కి ముంబై లో జరగనున్నది.

ఇప్పుడు ఐపీల్ కు సంబంధించిన ఒక వార్త హల్చల్ చేస్తుంది. అదేమిటంటే ఈ ఏడాది జరిగే ఐపీల్ ను ఆపాలని కోర్ట్ లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫీల్ దాఖలు చేసాడు. ఐపీఎల్‌లో బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ జరగకుండా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని అయన ఫీల్ లో నమోదు చేసాడు.

ఈ కారణం చేత ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌ను ఆపాలని సంపత్‌కుమార్ అనే ఆ అధికారి కోరారు. ఐపీఎల్‌లో ఆడే 8 జట్లను ఇందులో ప్రతివాదులుగా ఆయన చేర్చారు. ఓ విచారణ అధికారిగా తాను ఐపీఎల్ బెట్టింగ్ స్కామ్‌ను బయటపెట్టానని ఆ పిల్‌లో సంపత్ పేర్కొన్నారు అని సమాచారం.

ఈ విషయంలో ఐపీల్ నిర్వాహకుల నుండి ఇంకా ఎటువంటి స్పందన రాలేదని తెలుస్తున్నది. ఐపీల్ ప్రేమికులు మాత్రం కోర్ట్ తీర్పు ఏవిధంగా వుంటుందో అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా ఐపీల్ లో పాల్గొనే 8 జట్లు ఇప్పటికే నెట్ లలో తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

Related News