Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భాషా ని మరిపిస్తున్న పేట ...ఆనందం లో అభిమానులు .....

Category : movies

ఇటీవల కాలంలో వచ్చిన కబాలీ , కాలా , రోబో 2.౦ , ఇవన్నీ పాత రజనీకాంత్ ను అభిమానులకు గుర్తు చేయలేకపోయాయనడంలో సందేహం లేదు. కానీ, నేడు సంక్రాంతి కానుకగా విడుదలైన పేట మాత్రం 1990 దశకంలో రజనీని గుర్తు చేసిందని అభిమానులు చెప్తున్నారు . ఈ ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు పడగా, చిత్రం చూసిన వారు సినిమా అద్భుతంగా ఉందని కితాబిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బీజీఎం సూపరని అంటున్నారు. ఈ సినిమా రజినీకాంత్ స్టైల్ లో నడిచిన పక్కా మాస్ సినిమా అని, ‘బాషా’ను మించిపోయిందని చెబుతున్నారు. రజినీ కామెడీ టైమింగ్, ఫైట్లు, మాస్ పాటలు అభిమానులకు కావాల్సిన వన్నీ ఉన్నాయని, ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకే హైలైట్ అని మరికొందరు చెప్తున్నారు.

విభిన్న చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజ్ పేట చిత్రంతో ఆశ్చర్యపరిచాడు. రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ తో మాస్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాన్ని డీల్ చేయడంలో సత్తా చాటాడు అని , భాష తరహాలో అద్భుతమైన ఫ్లాష్ బ్యాక్ తో పేట కథని రాసుకున్నాడు అని , ఈ చిత్ర కథకు తగ్గట్లుగా నటీనటుల్ని సరిగ్గా ఎంచుకున్నాడని చెప్తున్నారు . ఈ సినిమా అభిమానులకి అంతగా నచ్చడానికి మరో ముఖ్యకారణం విజయ్ సేతుపతి . ఈయన ఈ సినిమా లో ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు , నవాజుద్దీన్ సిద్దిఖీ తమ నటనతో పేట చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చారు. అనిరుద్ రవిచందర్ రజని ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే సంగీతం అందించాడు. ముఖ్యంగా మరణ మాస్ సాంగ్ విజిల్స్ కొట్టించే విధంగా ఉంది. బ్యాగ్రౌండ్ సంగీతం రజినీ పాత్రని ఎలివేట్ చేసే విధంగా ఉంది.

ఇక పేట చిత్రాన్ని చూసిన ప్రతి అభిమాని క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ మతిపోగోట్టే ట్విస్ట్ తో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసినట్లు తెలుస్తోంది. రజీని కాంత్ రెండు గెటప్స్ లో అభిమానులని అలరించాడు . ఏదేమైనా రజినీ చాల రోజుల తరువాత అభిమానులకి అన్ని కలిసిన పండుగ విందుని ఇచ్చాడనే చెప్పాలి .

Related News