//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వందకి చేరువైన పెట్రోల్ ధర

Category : national politics

దేశంలో రోజురోజుకి పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మోడీ నేతృత్యంలోని బీజేపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. ఈ రోజు శుక్రవారం కూడా పెట్రోల్ ధరలు పెరిగాయి. న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.82.32కు చేరుకోగా, డీజిల్ 73.87గా ఉంది. ముంబైలో రిటైల్ పెట్రోల్ సరికొత్త రికార్డు సృష్టించింది. లీటర్ పెట్రోల్ 89.69కు, డీజిల్ రూ.78.42కు చేరింది.Petrol price increase

వాణిజ్య నగరాలైన ముంబై, ఢిల్లీ, కోల్‌కకతాలో గురువారం సైతం రూ.0.6 చొప్పున పెట్రోల్ ధర పెరిగింది. దాంతో ఢిల్లీలో నిన్న లీటర్ పెట్రోల్ రూ.82.22, ముంబైలో రూ.89.60, కోల్‌కతాలో 84.70కి చేరింది. కాగా, చెన్నైలో లీటర్ పెట్రోల్ 7 పైసలు పెరిగి రూ.85.48కి చేరుకుంది.

అయితే ఈ నాలుగు మెట్రో పాలిటన్ సిటీల్లోనూ డీజిల్ ధరలు యథాతథంగానే ఉన్నాయి. కొన్ని రోజులుగా ఇంధనం ధరలు పైపైకి పోతుండగా, అంతర్జాతీయ పరిణామాలే ఇందుకు కారణమని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెబుతున్నారు. ఈ ధరలు 100 కి పైగా పెరగ వచ్చని దేశ ప్రజలు అనుకుంటున్నారు. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని ప్రజలు అనుకుంటున్నారు.Petrol price increase

Related News