సాధారణంగా మనం పెళ్లికి వెళ్ళినప్పుడు విలువైన వస్తువులను కానుకలుగా ఇస్తాం. అయితే తన స్నేహితుడి పెళ్ళికి వినూత్నగా అలోచించి గిఫ్ట్ ఇచ్చాడు ఆ స్నేహితుడు. అది ఓపెన్ చేసిన స్నేహితుడు నిర్గాంతపోయాడు. ఆతర్వాత పొట్టచెక్కలయ్యేలా నవ్వడం మొదలుపెట్టారు.
తమిళనాడులోని కడలూరులో జరిగింది ఈ సంఘటన. తమ మిత్రుడికి పెళ్లికానుకగా 5 లీటర్ల పెట్రోలు క్యాన్‌ను గిఫ్ట్ గా ఇచ్చారు అతని స్నేహితులు. అది చుసిన అతను నివ్వెరపోయి తరువాత నవ్వడం మొదలుపెట్టాడు.
రోజురోజుకి పెరుగుతున్న పెట్రోలు ధర మూలంగా ఇదే ఇప్పుడు విలువైన వస్తువుని భావించి వరుడికి గిఫ్ట్ గా ఇచ్చారు మిత్ర బృందం.