//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెరుగుతున్న ప్రజా మద్దతు

Category : editorial

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విపక్షాలు ఆరోపించే తరహాలో ప్రజల్లో వ్యతిరేకత లేదని మరోసారి స్పష్టమైంది. వివాద పధకాల్లో ప్రభుత్వ పని తీరు తదితర అంశాల్లో ప్రజల సంతృప్తి గణనీయంగా పెరగడం ప్రభుత్వ వర్గాలను ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళితే ఎన్డియే నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చిన తర్వాత లాభపడింది అనే అభిప్రాయలు ఉన్నాయి. ఇక్కడ మతం కూడా ఒకరకంగా తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చింది అనే మాట కూడా వినపడింది.

అప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్న కొన్ని వర్గాలు చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతించడమే కాకుండా ఆయనను స్వయంగా కలిసి మద్దతు ప్రకటించాయి. అలాగే ప్రభుత్వ పని తీరు కూడా ఇందుకు బలం చేకూర్చింది. రాష్ట్రం కష్టాల్లో ఉన్నా ప్రజల్లో ఎక్కడా కూడా నిరాశ లేకుండా చంద్రబాబు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మినహా మరొకరు రాష్ట్రాన్ని నడిపించలేరు అంటూ పలువురు పేర్కొంటున్నారు.

ఇదిలా ఉంటె ప్రభుత్వ పని తీరుపై ప్రభుత్వం ప్రజల్లో అభిప్రాయం తెలుసుకుంది. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత వారం రోజుల్లో ప్రభుత్వం పట్ల ప్రజల్లో సంతృప్తి శాతం పెరుగుతుండడం గమనార్హం. ‘1100’ పరిష్కార వేదిక ద్వారా ఈ నెల 19 నుంచి 25వ తేదీ మధ్యకాలంలో ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది.

అంతకు ముందు ప్రభుత్వ పనితీరుపై 68% ఉన్న సంతృప్తిస్థాయి ఏకంగా 74 శాతానికి చేరుకోవడం గమనార్హం. ప్రభుత్వం అమలు చేస్తున్న 31 పథకాలకు సంబంధించి 17 విభాగాల పనితీరుపై ప్రజాభిప్రాయం సేకరించారు. అందులో పలు శాఖల పనితీరుపై ప్రజల్లో సంతృప్తి శాతం పెరుగుదల కనిపించింది. దీనితో ఎన్డియే నుంచి తెలుగుదేశం బయటకు వచ్చినా ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదనేది స్పష్టమైంది.