ఐసీసీలో ఛైర్మన్ శశాంక్ మనోహర్ బీసీసీఐకి వ్యతిరేకంగా వ్యవరిస్తున్న విషయం తెలిసిందే. అదే అదునుగా భావించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) బీసీసీఐ పై బెదిరింపులకు పాల్పడుతుంది. తమతో ద్వైపాక్షిక సిరీస్లు ఆడకపోవడం వల్ల వచ్చిన నష్టాన్ని పరిహారంగా చెల్లినచాలని దావా వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. దుబాయ్లో ఐసీసీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా బీసీసీఐ ప్రతినిధులకు ఈ విషయం తెలియజేసినట్లు పీసీబీ ఛైర్మన్ నజమ్ సేథీ ట్వీట్ చేశారు. ‘2014లో కుదిరిన ఒప్పందం ప్రకారం తమతో సిరీసులు ఆడేందుకు వ్యతిరేకిస్తున్నందుకు దావా వేస్తున్నట్లు బీసీసీఐకి పీసీబీ తెలిపింది’ అని సేథీ ట్వీట్ చేశారు. ఈ ఒప్పందం ప్రకారం 2015 నుంచి 2023 మధ్యలో భారత్ 6 ద్వైపాకిక్ష సిరీసులు ఆడాల్సి ఉంటుంది. ప్రభుత్వ అనుమతి లేదని బీసీసీఐ ఈ సిరీస్లు ఆడడం లేదు. భారత వ్యతిరేకతతో దాదాపు రూ.1200 కోట్లు నష్టం వచ్చినట్లు పీసీబీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఐసీసీలో బీసీసీఐ ప్రభావం తగడ్డంతో పాకిస్తాన్ కి రెచ్చిపోతుంది. మరి ఇప్పుడు బీసీసీఐ ఏంచేస్తుందో చూడాలి.