ఆన్ లైన్ చెల్లింపుల దిగ్గజం పేటీఎం త్వరలో బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించేందుకు పేటీఎం బ్యాంకు ను తీసుకురానున్నారు. దీనికి సంబందించిన అనుమతులను ఆర్బీఐ మంజూరు చేసినది. మే 23 నుండి ఈ సదుపాయం అందుబాటులోకి రానున్నది. దీంతో కంపెనీ తన ఈ వాలెట్ వ్యాపారాన్ని ఈ బ్యాంకుకు బదిలీ చేయనుంది. ఇప్పటికే పేటీఎంకి 21.8 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. మే 23 తర్వాత నుంచి పేటీఎం వాలెట్ పీపీబీఎల్లో భాగమవుతుంది. ఎవరికైనా ఈ విషయం నచ్చకపోతే ముందుగానే పేటీఎంకు తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడు పేటీఎం ఈ వాలెట్లోని బ్యాలెన్స్ వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తుంది. ఈ విషయాన్ని మే 23 కంటే ముందే తెలియజేయాల్సి ఉంది. పేటీఎం బ్యాంక్ రూ.లక్ష వరకు డిపాజిట్లను నేరుగా స్వీకరిస్తుంది.