//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జ‌న‌సేనానిని కోడిగుడ్డు మీద ఈక‌లా తీసిప‌డేసింది..!!

Category : politics

జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను యాంక‌ర్ క‌మ్ న‌టి శ్రీ‌రెడ్డి కోడిగుడ్డు మీద ఈక‌లా తీసిప‌డేసింది. అయితే, శ్రీ‌రెడ్డి గ‌తం తెలిసిన వారంతా ఈ మాట ఒప్పుకోక త‌ప్ప‌దు మ‌రీ. శ్రీ‌రెడ్డి మొద‌ట బ్యూటీషియ‌న్‌గా కెరియ‌ర్ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. అయితే, శ్రీ‌రెడ్డి బ్యూటీషియ‌న్‌గా కెరీర్ ప్రారంభించిన స‌మ‌యంలో త‌న స‌న్నిహితులు ఇచ్చిన స‌ల‌హాతో ఓ ప్ర‌ముఖ ఛానెల్లో న్యూస్ రీడ‌ర్‌గా విధులు నిర్వ‌హించింది. ఆపై తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌పై మ‌క్కువ పెంచుకున్న శ్రీ‌రెడ్డి సినిమాల్లో అవ‌కాశాల కోసం ప్ర‌ముఖుల చుట్టూ తిర‌గ సాగింది. ఆ క్ర‌మంలోనే టాలీవుడ్‌కు చెందిన బ‌ఢా నిర్మాత సురేష్ కుమారుడు అభిరామ్ సినిమా అవకాశాలు ఇప్పిస్తానంటూ త‌న‌ను శారీర‌కంగా వాడుకున్నాడ‌ని మీడియా సాక్షిగా ఫోటోలు లీక్ చేసిన విష‌యం తెలిసిందే.

ఇక అప్ప‌ట్నుంచి టాలీవుడ్‌లో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అరాచ‌కాల‌కు అడ్డుక‌ట్ట వేసే దిశ‌గా శ్రీ‌రెడ్డి పోరాటం చేసింది. టాలీవుడ్‌లో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ప్ర‌తీ మ‌హిళ‌ను పిలిచి స‌మావేశం ఏర్పాటు చేసి తెలుగు సినీ ఇండ‌స్ర్టీపై యుద్ధం ప్ర‌క‌టించింది. ఆ స‌మ‌యంలోనే సినీ ఇండ‌స్ర్టీ నుంచి జ‌నసేన పార్టీ స్థాపించి ప్ర‌జా జీవితంలోకి వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ లైంగిక వేధింపుల‌పై స్పందించాల‌ని శ్రీ‌రెడ్డి కోరింది. అయితే, శ్రీ‌రెడ్డి ఏస్తున్న పోరాటం త‌న‌కు న‌చ్చ‌లేద‌ని, కావాలంటే పోలీసు స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలే త‌ప్ప‌.. ఇలా ధ‌ర్నాలు చేయ‌డం ఏంట‌ని ప‌వ‌న్ క‌ల్యాన్ ఎదురు ప్ర‌శ్నించిన విష‌యం తెలిసిందే.

అంతేకాకుండా, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ టార్గెట్‌గా శ్రీ‌రెడ్డి విమ‌ర్శ‌నాస్ర్తాలు సంధిస్తూనే ఉంది. ఒక న‌టికి న్యాయం చేయ‌లేని వ్య‌క్తి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ బ‌య‌ల్దేరాడు. ఇది హాస్యాస్ప‌ద‌మంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు పెట్ట‌డం ప్రారంభించింది. అలాగే, జ‌న‌సేన పార్టీలో ఉన్న వారంతా క‌మ్మ వారేన‌ని, ప‌వ‌న్ స్థాపించింది జ‌న‌సేన పార్టీ కాద‌ని, క‌మ్మ‌సేన అంటూ ఎద్దేవ చేసింది. ఇలా ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను కోడిగుడ్డు మీద ఈక‌లా తీసేస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టుల వ‌ర్షం కురిపిస్తోంది శ్రీ‌రెడ్డి. శ్రీ‌రెడ్డి సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌న‌సేన పార్టీపై చేస్తున్న పోస్టుల‌కు జ‌న‌సేన సైనికులు రియాక్ట్ కాక‌పోవ‌డం కొస‌మెరుపు.