//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చింతమనేని కేసుల చిట్టా వినిపించిన పవన్‌

Category : national politics

చింతమనేని కేసుల చిట్టా వినిపించిన పవన్‌ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జనసేన ఈతరం యువత పార్టీ అని ఈ తరమే రేపటి తరాన్ని శాసించి తీరుతుందని అన్నారు. తాను అన్ని కులాలు, మతాలను సమానంగా చూడగలిగే వ్యక్తినని అన్నారు. ‘‘2014 ఎన్నికల సమయంలో టీడీపీకి తన మద్దతును తెలిపాను. ఆతరువాత రాష్ట్రంలో బలమైన శాంతిభద్రతలుతో పాటు ఆడపిల్లలకు భద్రత ఉండాలని చంద్రబాబును కోరానన్నాడు. కానీ తానేమి ఆశించలేదు అన్నాడు.

అదేవిధంగా ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మద్దతు ఇవ్వాలా? వారు కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించే రాజకీయాలు చేస్తున్నారు’’ అని ఆరోపించారు. రాజ్యాంగేతర శక్తులు, అసాంఘిక శక్తులు రాజ్యమేలుతుంటే.. వారి అరాచకాలకు వ్యతిరేకంగా జనసేన పోరాటం చేస్తుందన్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్. చింతమనేని పై వివిధ పోలీస్‌ స్టేషన్లలో 27కేసులు నమోదయ్యాయని, కేసుల చిట్టాను చదివి వినిపించారు పవన్. ఎమ్మెల్యేలను అదుపు చేయడంలో ముఖ్యమంత్రి వైఫల్యం చెందారని, వారికి ప్రజలే బుద్ది చెబుతారన్నారు. అయితే ఈ సభని ఎమ్మెల్యే చింతమనేని అడ్డుపడతారనే ప్రచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.