//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పవన్‌కల్యాణ్‌ ఇంటికి నేడే భూమి పూజ..!

Category : state

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. పార్టీ స్థాపించిన సమయం లో ఎన్నికలకి తక్కువ సమయం ఉండడం తో మిత్రపక్షాలతో కలిసి వెళ్లారు. కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికలల్లో అయన ఒంటరిగా పోటీ చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు.

మార్చి 14 వ తేదీన గుంటూరు లో భారీ సభ ను ఏర్పాటు చేసి నేతలు, కార్యకర్తలు, అభిమానుల మధ్య పార్టీ ద్యేయం , పార్టీ ప్రణాళికలను ప్రకటించనున్నారు. ఈ సభకు కావలిసిన ఏర్పాట్లు దాదాపుగా అన్ని పూర్తయ్యాయి.

దీనితో పాటుగా అమరావతి వేదిక గా రాజకీయ ప్రస్థానం చేయాలనీ నిర్ణయం తీసుకున్నాక అక్కడ పార్టీ ఆఫీస్ కి కావలిసిన స్థలాన్ని తీసుకోని పార్టీ కార్యాన్ని నిర్మించనున్నారు. అలాగే ఇక్కడే ఉండి రాజకీయాలలో ఎక్కువ సమయం గడపడానికి గుంటూరు లోని కాజు దగ్గర రెండెకరాల స్థలం తీసుకోని తన నివాసం ఏర్పాటు చేయాలనీ నిర్ణయం తీసుకొన్నారు.

దీనిలో భాగం గా నిన్న సాయంత్రం విజయవాడకు కుటుంబ సమేతంగా చేరుకున్నాడు. ఈ రోజు ఉదయం ఇంటి భూమి పూజ లో పాల్గొన్నాడు. ఈ విషయాన్ని జనసేన నాయకులూ చాలా గోప్యం గా ఉంచాయి. పూజ తరువాత అయన పార్టీ నేతలతో, అలాగే కార్యకర్తలతో చర్చించనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా డీజీపీ కి తన పర్యటన వివరాలను అందజేసారు.