Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

30 కి పైగా సీట్లు జనసేన కి వస్తే....పవన్ మద్దతు ఏ పార్టీ కి...? సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు లో పవన్ స్థానం ఏంటి...?

Category : politics

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను వంట పట్టించుకున్న జనసేన.... మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ కి భారీగా పెరిగిన ఓట్ బ్యాంక్. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు అయిన వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల మధ్యే త్రిముఖ పోటీ జరిగిందని చెప్పవచ్చు.ఈ పోటీ లో గెలుపు ఎవరిది అయిన ఆ గెలుపు మెట్టు ఎక్కాలంటే మాత్రం. జనసేన పార్టీ అండ దండలు అంతే అవసరం అన్న తాటి పైకి వచ్చిన టీడీపీ, వైసీపీ పార్టీలు. జనసేన పార్టీ చాలా బలంగా ఉన్న జిల్లాల విషయానికి వస్థే అందులో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలు గా చెప్పు కోవచ్చు.ఈ మూడు జిల్లాల్లో ఈ పార్టీ కి ఉన్న ఓట్ బ్యాంక్ 2009 ఎన్నికల ప్రకారం చూసుకున్న....ఇప్పటికీ అక్కడ జనసేన కు ఆదరణ తగ్గలే దనే చెప్పవచ్చు.అలాగే గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆ పార్టీ కి మంచి క్యాడర్ తో పాటు..... సొంత సామాజిక వర్గం కూడా ఉండడం ఆ పార్టీ కి అన్నీ విధాల కలిసొచ్చే అంశాలు.

ఇది ఇలా ఉంటే ఈ ఆరు జిల్లాల్లోనూ ఆ పార్టీ కి స్థానికంగా మంచి ఓట్ బ్యాంక్ ఉందనే చెప్పవచ్చు.2009 లో పీఆర్పీ పోటీ చేసినప్పుడు కూడా ఈ జిల్లాల్లో వారు గెలిచిన సీట్లు,వారికి లభించిన మద్దతు, పోల్ అయిన ఓటింగ్ అన్నీ చూసుకుంటే ఆ అంచనాలన్ని నిజమే అనిపిస్తుంది.ఈ లెక్కన ఆ పార్టీకి ఉభయ గోదావరి,విశాఖ జిల్లాల్లో చూసుకుంటే 45 వేల నుంచి 60 వేల వరకు ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో పోలింగ్ నమోదు అయ్యే ఆస్కారమే ఎక్కువగా ఉంది.అలాగే కృష్ణా, గుంటూరు వంటి జిల్లాలో ఆ పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో 30 వేల నుంచి 35 వేల మధ్య ఓట్ పోలింగ్ అయ్యేలా ఉంది.ఇక శ్రీకాకుళం,ప్రకాశం జిల్లాల్లో చూసుకుంటే 20 వేల నుంచి 25 వేల మధ్య పోల్ అయ్యేలా ఆ పార్టీ శ్రేణులు ఇప్పటికే ఎన్నో లెక్కలు కట్టారు. అలాగే గతంలో పీఆర్పీ గతంలో వచ్చిన ఓట్లను పరిగణలోకి తీసుకొని ఆ పార్టీకి 55 నుంచి 60 స్థానాల్లో సీట్లు వచ్చే ఆస్కారం ఉన్నట్లు లెక్కలు వేసుకుంటున్నారు.

అలాగే జనసేన ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్ అవుతాడు... అంటూ భారీగా బెట్టింగులు కూడా నడుస్తున్నాయి.అంతే కాకుండా ఆ పార్టీ గెలవబోయే సీట్లపై కూడా భారీ స్థాయిలో బెట్టింగులు నిర్వహిస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు. ఇది ఇలా ఉంటే ....ఏపి లో ప్రధానంగా అన్ని పార్టీల తో పాటు సామాన్యుల లో కూడా వినిపిస్తున్న ఓకే ఒక్క మాట జనసేన పార్టీ కి గనక 40 నుంచి 50 సీట్లు వస్తే వారు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు అని.ఇదే ప్రశ్న ప్రధాన పార్టీల నాయకుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరిలో అలజడి సృష్టిస్తున్న ప్రశ్న. ఇందులో కూడా ఓ తిరకాసు ఉంది. టీడీపీ కి గనక 100 నుంచి 110 సీట్ల మెజారిటీ గనక వస్తె అపుడు వారికి జనసేన పార్టీ మద్దతు తో పని లేదు. అలాగే వైసీపీ కూడా 100 కు పైగా సీట్లు వచ్చి ఉంటే కూడా ఆ పార్టీ కి జనసేన పార్టీ మద్దతు తో అసలు పని లేదు. బై ఛాన్స్.... టీడీపీ లేదా వైసీపీ పార్టీలకు పూర్తి మెజారిటీ రాని పక్షంలో అంటే 175 సీట్లలో 70 టీడీపీ కి మరో 70 వైసీపీ లకు గనక వచ్చి ఉంటే అప్పుడు మెజారిటీ సీట్ల కోసం.... జనసేన పార్టీ తో పొత్తు పెట్టుకునే ఆస్కారం అధికంగా ఉంటుంది. తద్వారా ఏపి లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు లో జనసేన ప్రధాన భూమిక పోషిస్తుంది అని మాత్రం చెప్పవచ్చు. ఇదంతా జరగాలంటే గుర్తు ఉంది కదా.. జనసేన పార్టీ కి 30 కి పైగా సీట్లు రావాలి.మిగిలిన పార్టీలకు మెజారిటీ కంటే తక్కువ సీట్లు రావాలి.ఎప్పుడు జనసేన అవుతుంది కింగ్ మేకర్.

Related News