//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జగన్ కి పవన్ ఓపెన్ ఆఫర్.....!

Category : politics

ఏపీ లో రాజకీయం ఇప్పుడు రోజుకో మలుపుతో తీవ్రమైన ఉత్కంఠను రేపుతున్నాయి. ప్రస్తుతం అన్ని పార్టీ ల ముఖ్య నేతలు తమ మెదడుకి పని పెడుతున్నారు. వీరందరికంటే ముందుగా ఆలోచించిన ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర తో రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు.

ప్రస్తుతం జగన్ పాదయాత్ర విజయవంతం గా జరుగుతుంది. అన్ని రకాల వర్గాల నుండి జగన్ కు ఆదరణ లభిస్తుంది. దీనితో ఇప్పటికే కొంతమంది కీలక నేతలు వైసీపీ లోకి రావడానికి సన్నాహాలు మొదలుపెట్టారని తెలుస్తుంది.

ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో ఆనందం కలిగించే విషయం ఏమిటంటే, టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగన్ కి సపోర్ట్ ఇచ్చే విషయం లో క్లారిటీ కి వచ్చాడని స్వయానా వైసీపీ ఎంపీ వరప్రసాద్ గారు చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో పవన్ జగన్ కి సపోర్ట్ గా నిలుస్తాడు అని తెలుస్తుంది. ఎందుకు అంటే అయన ఇప్పుడు టీడీపీ తీరుపై పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాడు. అలాగే ఇప్పుడు ప్రజలలో జగన్ కూడా కొంతమేర పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండడం తో జగన్ కి సపోర్ట్ విషయం లో పవన్ సుముఖత వ్యక్తం చేస్తున్నాడని తెలుస్తుంది. 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇవ్వడానికి పవన్ సిద్ధంగా ఉన్నారని వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Related News