//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పవన్ కళ్యాణ్ లేఖ.. ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే భాద్యత..!

Category : politics

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రేపు గుంటూరులో జరగబోయే జనసేన ఆవిర్భావ మహాసభకు భద్రతను అందించబోతున్న ఏపీ డీజీపీకి కృతజ్ఞతలు తెలుపుతూ, రేపు జరగబోయే కార్యక్రమానికి కట్టు దిట్టమైన రక్షణ కల్పించాలని, విధి నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని తన పై దాడి జరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

అయితే, తనపై దాడి జరిగితే ప్రజా జీవితంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, గతంలో భీమవరంలో ఫ్లెక్సీ చింపేసినందుకే అభిమానులు ధర్నా చేశారని అన్నారు. విజయవాడలో ఉద్దానం బాధితుల విషయమై సీఎంని కలవడానికి వచ్చినప్పుడు రెండు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తన పర్యటనలలో ప్రజలు తొక్కిసలాటకు గురవుతున్నారని, ఎటువంటి సమస్యలు తలెత్తకుండా రక్షణ భాధ్యతలు చెప్పట్టాలని లేఖలో కోరుకున్నారు. భద్రతకు పోలీసులు నిస్సహాయత వహిస్తే, ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

Related News