//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రజా సమస్యలకు దగ్గరగా ఉండాలనే ........పవన్ కళ్యాణ్

Category : politics

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సతి సమేతంగా వచ్చిపార్టీ అభిమానులు చూపించిన స్థలం లో గృహ నిర్మాణం కొరకు భూమి పూజా జరిపారు ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మంగళగిరి నాకు ఎంతో ఇష్టమైన ప్లేస్ అని ఇక్కడ మా నాన్నగారు కానిస్టేబుల్ గా పనిచేసారు అని గుర్తుచేశారు పార్టీ కార్యాలయ నిర్మాణం కూడా భూమి లభ్యతను బట్టి ఈ ప్రాంతంలోనే నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. ఇక్కడ నివసించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని ఇప్పటికి నెరవేరిందని తెలిపారు.ప్రజలకి దగ్గరగా ఉండాలి అని ప్రజా సమస్యలు మరింత దగ్గరిగా ఉండి తెలుసుకొని పరిష్కరించాలని ఈ నిర్ణయం తెలుకున్నానని వెల్లడించారు అదేవిధంగా.నేను ఏమి సీఎం కొడుకుని కాదని, ప్రజల దగర ఏమి దోచుకోలేదని, రెండు దశాబ్దాలు సినిమాలలో ఉంటూ ప్రజాభిమానం తో నేను ఏదేనా సంపాదించానని,నాకున్న ఆస్తి పాస్తులు అన్ని ఆదాయ పన్నుశాఖ తెలుసనీ మిగతావాలకి నాకు చాల తేడా ఉందని నేను కస్టపడి ముందుకు సాగుతున్నానని వ్యతిగతం గా నాకు ఎటువంటి శత్రువులు లేరని సమస్యల నుంచి పారిపోయేవాడిని కాదని అయన తెలిపారు అదేవిధంగా పార్టీ నిర్వహించిన సదస్సుకు 40 వేల మంది హాజరు అయినట్టు తెలిపారు అందులో అనేక రంగాలకు చెందిన వారు ఉన్నారని తొలుత 12 తో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలనీ నిర్ణయం తీసుకున్నట్టు వీరు పార్టీ విధి విధానాలను ప్రజలకు మరియు మీడియా కి సమాచారమిచ్చేలా చర్యలు తీసుకుంటా ఈ కమిటీ ని పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు వెల్లడిస్తానని

జనసేన వెనుక కథస్క్రీన్ ప్లే చంద్రబాబు అని అటు జగన్ మరియు వై క పా నాయకులూ పదే పదే అంటున్నారని దేనిని ఎందుకు కండిచలేదని మీడియా ప్రతినిధి ఒకరు ప్రశ్నించారు వారిని మోదీ నడిపిస్తున్నారని అనుకోవచ్చా అని తిరిగి ప్రశ్నించారు రాజకీయం అనగా చాల మంది చాల రకాలుగా మాట్లాడుతారని దేనికి స్పందించాలో లేదో నాకు తెలుసు అని జవాబు ఇచ్చారు అలాగే ‘‘రాజకీయాలపై నాకు చాలా స్పష్టత ఉంది. 2007 నుంచి చూస్తున్నా. పార్టీలు పెట్టినప్పుడు కొత్త మనుషులు ఎంతో మంది వస్తుంటారు. పోతుంటారు... అసొంలో అస్సాం గణ పరిషత్‌ (ఏజీపీ) స్థాపించినప్పుడు అది ఉవ్వెత్తున కెరటంలా ఎగిసిపడి చివరకు చతికిలపడింది. యువతకు ఉడుకు రక్తంతోపాటు అనుభవం ఉండాలి. పెద్దల్లో ఉండే సమయస్ఫూర్తి, అనుభవాలు నాలాంటి వారికి చాలా ఉపయోగపడతాయి’’ అన్నారు. 14న నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట జరగనున్న పార్టీ ఆవిర్భావ సదస్సులో తాను రాజకీయాలు ఎలా చేయాలనుకుంటుంది స్పష్టత ఇస్తానన్నారు. వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ రూపొందించిన గీతాన్ని పార్టీ సోషల్‌మీడియా విభాగం విడుదల చేసింది.ఏదేమైనా బుధవారం జన సేన పార్టీ అభిమానులకు మరచిపోని రోజుల మిగిలిపోతుంది