//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెలంగాణా ఎన్నికలపై పవన్ సంచలన నిర్ణయం ... జోష్ లో గులాబీ శ్రేణులు

Category : politics

పవన్ కల్యాణ్ జనసేన పార్టీ తో ఏపీలో ప్రభంజనం సృష్టిస్తున్న నేత. తన అన్న మెగా స్టార్ చిరంజీవి లాగే రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన ఏపీలో అధికార పార్టీ పై చాలా అగ్రెసివ్ గా పోతున్నారు. గడచిన ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికిన ఆయన ఈసారి అధికార పార్టీ పై యుద్ధానికి సిద్ధం అవుతున్నారు . ఇక తాజాగా నాలుగేళ్ల అనంతరం తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికలలో తన మద్దతు ఏ పార్టీకి ఉంటుందో ఇప్పటి వరకూ ప్రకటించలేదు. మొదట తెలంగాణా ఎన్నికల బరిలో ఉంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ సారికి పోటీ నుండి తప్పుకున్నారు. కానీ ఏ పార్టీ కి తన మద్దతు వుంటుందో పవన్ ప్రకటించలేదు. ఇప్పుడు అది చాలా ఆసక్తిగా అనిపిస్తుంది.

ఇక రెండు రోజులలో తెలంగాణ ఎన్నికలు ఉన్నాయన గా పవన్ కల్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. తమ పార్టీ తెలంగాణలో ఎవరికి మద్దతిస్తోందో ఈ నెల 5వ తేదీన ప్రకటిస్తామంటూ ట్వీట్ చేసారు. దీనిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో పవన్ ఫ్యాన్స్ ఉన్న నేపధ్యంలో పవన్ ప్రభావం కూడా ఎన్నికలపై ఉండే అవకాశం వుంది. తీరా సమయానికి ఆయన తమ మద్దతు ఏదో ఒక పార్టీ కిఇవ్వనున్నారని చెప్పినా ఆయన మద్దతు ఇచ్చే పార్టీ టీఆర్ ఎస్ అని చాలా మంది భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ గురించి తెలిసిన వారంతా ఆయన మద్దతు అధికార తెలంగాణ రాష్ట్ర సమితికే ఉంటుందని అంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు.

తెలంగాణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాలన పై పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు.ఇక కేటీఆర్కు పవన్ కళ్యాణ్ కు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తెలంగాణలో చేపడుతున్న నీటిపారుదల ప్రాజెక్టులు డబల్ బెడ్రూమ్ ఇళ్లు కల్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ వంటి పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని అనేక సార్లు చెప్పారు. అంతే కాకుండా గడచిన నాలుగేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన తనయుడు మంత్రి తారక రామారావును పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా కలుసుకుని అభినందించారు. మరోవైపు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో నిర్వహించిన జనసేన కవాతును మంత్రి కేటీఆర్ ను ప్రశంసించారు. ఆ సమయంలో కేటీఆర్ "శభాష్ పవన్ మీ కవాతుకు మా అభినందనలు అని ట్విట్ కూడా చేసారు. దీంతో వారి మద్దతు పవన్ కు వుంది కాబట్టి పవన్ మద్దతు కూడా టీఆర్ఎస్ కే వుండే అవకాశంవుంది .

చంద్రబాబు యాంగిల్లో చూసినా ఇక పవన్ కల్యాణ్ చంద్రబాబు నాయుడిని కాంగ్రెస్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ మద్దతు తెలంగాణ రాష్ట్ర సమితికే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికలకు రెండు రోజులు ముందు పవన్ కల్యాణ్ తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు ప్రకటిస్తే కారు జోరు మరింత ఊపందుకుంటుందని అంటున్నారు. పవన్ కల్యాణ్ కు ఆంధ్రలో కంటే తెలంగాణలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అదే జరిగితే తెలంగాణలో మళ్లీ కేసీఆర్ పార్టీ కి అదొక ప్లస్ పాయింట్ .

Related News