Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అజ్ఞాతవాసి తరువాత పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేసిన ....ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఏమైందో తెలుసా....?

Category : movies

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే ఓ నూతన అధ్యాయానికి నాంది పలికాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తిరుగులేని స్టార్ డమ్ తో కోట్లాది మంది అభిమానులు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్....తన ఎస్ అంటే కోట్ల కు కోట్లు పారితోషికాలు ఇచ్చి మరి సినిమాలు తీయగలిగే నిర్మాతలు ఉన్నప్పటికీ.... ప్రజా సేవ పట్ల తనకున్న బాధ్యతను, నిబద్దత ను రుజువు చేసుకోవడం కోసం ఆయన ప్రజా క్షేత్రం లో ఓ ప్రజా నాయకుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇప్పటి వరకు ఏ చిత్ర పరిశ్రమలో కూడా కెరీర్ పీక్స్ లో ఉండగా ఏ హీరో కూడా తీసుకొనటువంటి కీలక నిర్ణయం తీసుకున్నారు పవన్. బహుశా ఇలాంటి నిర్ణయం ఒక్క పవన్ కే చెల్లుతుందేమో.ఇది ఇలా ఉంటే అజ్ఞాతవాసి సినిమా పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పి ఆయన సంపూర్ణంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.కేవలం 40 సంవత్సరాల వయసులోనే రాజకీయాల్లో అడుగు పెట్టిన పవన్. ఏపి రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని ఓ రాజకీయ శక్తిగా మారారు.

తమ అభిమాన హీరో సినిమాలు చేయక పోయినా రియల్ లైఫ్ పాలిటిక్స్ లో తన దైన ముద్ర వేసుకుంటున్నదుకు మాత్రం ఆయన అభిమానులు ఎంత గానో గర్వపడుతున్నారు.ఇక భవిష్యత్తులో మళ్లీ పవన్ కళ్యాణ్ గనుక సినిమాల్లో నటిస్తారో లేదో తెలీదు కానీ..ఆయనతో సినిమాలు చేయడానికి మాత్రం చాలామంది నిర్మాతలు , మేకర్స్ ఆ అవకాశం కోసం నిత్యం శ్రమిస్తున్నారు.అయితే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తరువాత....పవన్ కెరీర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఖుషీ సినిమాను తీసిన ఏ.ఏం రత్నం నిర్మాణం లో ఓ సినిమా కూడా ప్రారంభించారు.అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఇవ్వడం వల్ల ఆ ప్రాజెక్ట్ అక్కడే ఆగిపోయింది. అయితే ఈ ప్రాజెక్ట్ లో తనకు బదులుగా పవన్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నీ నటింప జేయలని చూస్తున్నట్టు సమాచారం.ఇలాంటి నిర్ణయం వెనుక కూడా ఓ కారణం ఉంది ఆ స్టోరీ కి సాయి ధరమ్ తేజ్ అయితే బాగుంటుందని ఆలోచించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు...అంతే కాకుండా తాను ఇచ్చిన కమిట్ మెంట్ ప్రకారం ఆ నిర్మాత తో ఈ సినిమాకు సాయి ధరమ్ నీ హీరోగా ఫైనల్ చేశాడు పవన్.

Related News