//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వాడుకుని వదిలేశారు ! : నాపై ఐటీ దాడులు జరుగుతున్నాయి

Category : politics

ఆంధ్ర ప్రదేశ్ కు రావలిసిన ప్రత్యేక హోదాను తీసుకురావడానికి ఏపీ లో ని అన్ని రాజకీయ పార్టీ లు కలిసి పోరాడాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు.తమ మీద కేసులున్నాయని టీడీపీ , వైసీపీ కి చెందిన నేతలు భయపడుతున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యనించారు.

మనము ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన ప్రతిసారి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మనపై నీళ్లు చల్లుతున్నారని అయన అన్నారు.వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రత్యేక హోదా ఇస్తానని రాహుల్ గాంధీ చెప్పడం మంచి పరిణయం అని అన్నారు.

కేంద్రాన్ని వ్యతిరేకించే వారిపై ఇన్ కం ట్యాక్స్ దాడులు జరుగుతున్నాయని.. ఈ మధ్య నాపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయని సంచలన కామెంట్స్ చేశారు. కేంద్రాన్ని వ్యతిరేకించే వారిపై ఇన్ కం ట్యాక్స్ దాడులు జరుగుతున్నాయని.. ఈ మధ్య నాపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయని సంచలన కామెంట్స్ చేశారు.

2014 ఎన్నికలలో లో తనను వాడుకుని వదిలేశారని అనుకుంటున్నానని పవన్ చెప్పాడు. 2019 సార్వత్రిక ఎన్నికలలో తన వైఖరి ఏంటో గుంటూరు సభలో చెబుతానని అయన తెలిపారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు ఇప్పుడు రాజీనామా చేస్తే వస్తే ప్రయోజనం ఏమిటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్లి ధర్నా చేసిన ఉపయోగం లేదని చెప్పాడు.ఇప్పుడున్న ఈ సమాజం లో మాఫియా లీడర్స్ అయిన మాట మీద నిలబడతారేమోగాని, రాజకీయనాయకులు మాటమీద నిలబడరని పవన్ అన్నాడు.హోదాను సాధించడానికి జె ఏ సి లాంటింది ఏర్పడాలని అయన చూసించారు . ఈ హోదా ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమం లాగా ముందుకు తీసుకుపోయి కేంద్రం ఫై పోరాడాలి అని చెప్పారు.