//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ మ‌హిళ అన్న మాట‌తో.. జ‌న‌సేనాని నోట మాట రాలేదు..!

Category : politics

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం విశాఖ జిల్లా పాడేరు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. జ‌న‌సేన పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్రంగానే కృషి చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే పోరాట యాత్ర పేరుతో శ్రీ‌కాకుళం జిల్లా నుంచి మొద‌లు పెట్టి.. ప్ర‌స్తుతం విశాఖ జిల్లా మ‌న్యం ప్రాంతంలో ప‌వ‌న్ క‌ళ్యాన్ ప‌ర్య‌టిస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాన్ మ‌న్యం ప్రాంతం ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌జ‌ల‌నుద్దేశించి మాట్లాడుతూ.. చంద్ర‌బాబు స‌ర్కార్ మ‌న్యం గిరిజ‌నుల సంక్షేమాన్ని మ‌రిచింద‌ని విమ‌ర్శించారు.

మ‌న్యం ప్రాంతం, అలాగే ఇత‌ర గ్రామాల నుంచి సంవ‌త్స‌రానికి ఏపీ స‌ర్కార్‌కు రూ.9 కోట్ల ఆదాయం వ‌స్తుంద‌ని, ఆ ఆదాయాన్ని ఏం చేస్తున్నారో బ‌య‌ట‌పెట్టాల్సిన బాధ్య‌త సీఎం చంద్ర‌బాబుదేనంటూ ప‌వ‌న్ క‌ళ్యాన్ స‌వాల్ విసిరారు. ఇలా ప‌వ‌న్ కళ్యాన్ స‌వాల్‌కు ఓ మ‌హిళా నేత స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చింది. ఆ మ‌హిళ ఇచ్చిన కౌంట‌ర్‌తో జ‌న‌సేన సైనికుల‌తోపాటు ప్ర‌ధాన నాయ‌కుడి నోట మాట రాలేదు. ఆమెనె పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల్లో అవ‌కాశాలు లేక‌నే.. ఇలా రోడ్ల‌పై తిరుగుతున్నార‌న్నారు. సినీ రంగంలో అనుభ‌వం ఉండొచ్చు కానీ, ఇలా అస‌లు అభివృద్ధే జ‌ర‌గ‌ల‌దేంటూ ప్ర‌జ‌ల్లో సానుభూతి కోసం చంద్ర‌బాబు స‌ర్కార్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం త‌గ‌ద‌ని గిడ్డి ఈశ్వ‌రి పేర్కొన్నారు. రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌ల‌తో ప్ర‌జ‌ల మ‌న‌స్సుల‌ను గెల‌వ‌లేరు.. కాస్త ఆలోచించండి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటూ గిడ్డి ఈశ్వ‌రి స‌ల‌హా ఇచ్చింది.