Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జగన్ జైలుకే ....ఎప్పటికైనా చిప్పకూడే గతి..!

Category : politics state

ఏపీ రాజకీయం లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు వైసీపీ కి , ఇటు టీడీపీ కి కొరకరాని కొయ్యగా తయారయ్యాడు . మొన్నటివరకు టీడీపీ వెంట ఉన్న పవన్ సడెన్ గా యూ టర్న్ తీసుకోని వారి పైనే నిప్పులు చెరుగుతున్నారు . ఇక పొతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాష్ట్రం మొత్తం తిరుగుతూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నాడు . ఈ సమయం లో జగన్ పై తీవ్రమైన విమర్శలు చేసాడు . వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ నేరాలు చేశాడు. ఎప్పటికైనా లాలూప్రసాద్‌ యాదవ్‌లా జైలుకే వెళ్తాడు. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకుండా పారిపోయాడు. పాపం.. ముద్దులు పెట్టుకుంటూ పాదయాత్ర చేసుకుంటున్నాడు అంటూ జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఎద్దేవాచేశారు. ఆదివారం అనంతపురంలో ఆయన జనసైనికులతో కవాతు నిర్వహించారు.

గుత్తి రోడ్డులోని మార్కెట్‌యార్డు నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకు యువతతో భారీ ర్యాలీగా వచ్చి బహిరంగ సభలో మాట్లాడారు. సీఎం కావాలని తానెప్పుడూ కలలు కనలేదన్నారు. రాజ్యాంగం తనకు ఆ అవకాశం కల్పించే సమయమొచ్చిందని చెప్పారు. జగన్‌ తనకు శత్రువూ కాదని, సీఎం చంద్రబాబు మిత్రుడూ కాదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో మనల్ని ఏ కులమో, ఏ మతమో అని చూడకుండా ఆంధ్రులుగా చూసి తెలంగాణ నుంచి తన్ని తరిమేశారని ఆరోపించారు.

ఏపీ ప్రజలను తెలంగాణ నాయకులు దోపిడీదారులుగా చిత్రీకరించారన్నారు. ఇప్పుడేమో చంద్రబాబు ఎన్నికల పనిమీద హైదరాబాద్‌లో ఉన్నారని, పదేళ్ల ఉమ్మడి రాజధానిని వదిలేసి రావాల్సిన కర్మ ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు అన్యాయం చేశారన్నారు. ఇవన్నీ ప్రశ్నించాల్సిన జగన్‌ పాపం.. ముద్దులు పెట్టుకుంటూ పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇంకా ఏమన్నారంటే..వైఎస్‌ హయాంలో అత్యధికంగా సెజ్‌ల ద్వారా రైతులకే అన్యాయం జరిగింది. అందుకే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడడానికి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ రావడానికి సపోర్ట్‌ చేశాను. కానీ కొత్తకోడలు కొప్పులో చెప్పు పెట్టినట్లు ప్రధాని మోదీ జీఎస్టీతో ప్రజలను లూటీ చేశారు. అప్పట్లో చంద్రబాబు జనసేన సాయం అడిగారు. నేనేమీ ఆశించకుండా సహకరించా. రాష్ర్టాన్ని అవినీతిరహితంగా ఉం చాలని ఆయన్ను కోరా. నోట్లో వెన్నముద్ద పెట్టినా కొరకలేడని చెప్పే మంత్రి లోకేశ్‌ రాష్ట్రంలో ఇసుకను మింగేశారు.

‘వైసీపీ నేత బొత్స సత్యనారాయణ నాపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి. విజయనగరం వచ్చి ఆయన సంగతి తేలుస్తా. నేనేమంత మంచివాడిని కాదు. జగన్‌కు చంద్రబాబంటే భయం. పవన్‌ బీజేపీకి వత్తాసు పలుకుతున్నాడని బాబు, లోకేశ్‌ అంటున్నారు. నేనెప్పుడూ బీజేపీకి, మోదీకి భయపడను. ఆయన మహా అయితే కేసులు పెట్టి జైల్లో పెడతారు. మోదీ అంటే జగన్‌తోపాటు బాబు, లోకేశ్‌కూ భయమే. వారంతా పాత దొంగలు. అందుకే భయపడుతున్నారు అంటూ తనదైన రీతిలో విమర్శించాడు . చూడాలి మరి జగన్ పై చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ వారు ఏ విధంగా స్పందిస్తారో ...