//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జ‌గ‌న్‌లా ముద్దులు పెట్టేందుకు రాజ‌కీయాల్లోకి రాలేదు..!

Category : politics

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైంది. దీంతో పార్టీల అధినేత‌లు సైతం గెలుపు గుర్రాలను బ‌రిలో నిలిపేందుకు క‌స‌ర‌త్తులు ప్రారంభించారు. అయితే, తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ ఇప్ప‌టికే 105 మంది టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. అలాగే, ఇత‌ర పార్టీల నేత‌లు సైతం తాము బ‌రిలో నిల‌ప‌బోయే అభ్య‌ర్థి గెలుపోట‌ముల‌పై అంచ‌నా వేసేందుకు స‌ర్వేలు చేయిస్తున్నారు.

మ‌రోప‌క్క ప్ర‌జ‌ల మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్టేందుకు ప‌ర్య‌ట‌లు చేస్తూనే.. మ‌రో ప‌క్క త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అవ‌స‌ర‌మైతే అస‌భ్య ప‌ద‌జాలాన్ని సైతం వాడుతున్నారు.

అయితే, ఇటీవ‌ల కాలంలో సీఎం కేసీఆర్ నిర్వ‌హిస్తున్న ప్ర‌తీ స‌భ‌లోనూ త‌మ‌పై చెప్పూక‌డ‌ని రీతిలో బూతు పురాణాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారంటూ కాంగ్రెస్ నేత‌లు మీడియా ముందు వాపోయిన విష‌యం తెలిసిందే. కేసీఆర్ త‌న మాట‌ను మితీమిరితే.. తాము కూడా త‌మ ప్ర‌తాపం చూపిస్తామంటూ కాంగ్రెస్ నేత‌లు టీఆర్ఎస్‌కు హెచ్చ‌రిక‌లు చేశారు. తెలంగాణ రాజ‌కీయాల‌ ప‌రిస్థితి ఇలా ఉంటే.. ఏపీలో మాత్రం మ‌రోలా ఉన్నాయి.

రాజ‌కీయ ఆరోప‌ణ‌లు.. ప్ర‌త్యారోప‌ణ‌ల్లో భాగంగా గ‌తంలో వైఎస్ జ‌గ‌న్ జ‌న‌సేన అధినేత ప‌వన్ క‌ళ్యాణ్ మూడు పెళ్లిళ్ల‌పై ప్ర‌స్తావించిన విష‌యం తెలిసిందే. మామూలు గ్రామాల్లో ఎవ‌రైనా రెండో పెళ్లి చేసుకుంటేనే.. అత‌న్ని స‌మాజాం వెలిసిన‌ట్టుగా చూస్తుంద‌ని, అటువంటిది ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకుని కూడా సమాజంలో తిరుగుతున్నాడు అంటే అత‌నికి సంస్కారం లేదు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే, జ‌గ‌న్ చేసిన ఆ వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ స్పందిస్తూ.. తాను కావాల‌ని నాలుగు పెళ్లిళ్లు చేసుకోలేద‌ని, అలా జ‌రిగిపోయింది. దానికి న‌న్నేం చేయ‌మంటావు అంటూ స‌మాధానం ఇస్తూనే, మరోసారి త‌న‌పై ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తే మీ ఇంటి స‌భ్యుల గుట్టు ర‌ట్టు చేయాల్సి ఉంటుంద‌ని ఘాటుగా జ‌గ‌న్‌ను హెచ్చ‌రించారు ప‌వ‌న్‌.

ఇదిలా ఉండ‌గా, ప‌వ‌న్ క‌ళ్యాన్ మ‌రోసారి జ‌గ‌న్‌పై ప‌దునైన విమ‌ర్శ‌లు చేశారు. కాగా, మంగ‌ళ‌వారం నాడు పోల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా జ‌న‌సేన ఆధ్వ‌ర్యంలో భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేశారు. స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్‌ను ఉద్దేశించి ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్‌లా పాద‌యాత్ర చేస్తూ.. ముద్దులు పెట్టేందుకు తాను రాజకీయాల్లోకి రాలేద‌ని, తాను ఒక సాధార‌ణ కుటుంబం నుంచి వ‌చ్చాన‌ని చెప్పాడు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ఆర్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో జ‌గ‌న్ దోచుకున్న ల‌క్ష కోట్ల వివ‌రాల‌ను ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు. జ‌గ‌న్ ఎప్ప‌టికైనా మ‌ళ్లీ జైలు కెళ్ల‌డం ఖాయ‌మంటూ వైసీపీపై విమ‌ర్శ‌ల వర్షం కురిపించారు ప‌వ‌న్‌.

Related News