//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సీఎంగా ఎవరుండాలో నిర్ణయించుకోండి....పవన్ కళ్యాణ్....!

Category : politics

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన సభలో జనసేన పార్టీ గుర్తుని ప్రకటించాడు. అలాగే సభలో మాట్లాడుతూ టీడీపీ పార్టీ పై, అలాగే వైసీపీ పార్టీ పై తీవ్రమైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డాడు. జగన్ లక్షలకోట్లు దోచుకున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు ,అలాగే టీడీపీ నేతలు లక్షల కోట్లు దోచుకున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. దీనిపై పవన్ మాట్లాడుతూ ఒకరిపై ఒకరు లక్షల కోట్లు దోచుకున్నారని చెప్తున్నారు దీన్నిబట్టి చుస్తే రాజకీయంలో లక్షలకోట్ల రూపాయల దోపిడీ జరుగుతుందనేగా అర్థం అని చెప్పారు.

ఇలాంటి తప్పుడు పనిని నియంత్రించటానికి జనసేన పార్టీ ఎప్పుడూ కూడా వెనుకడుగువేయదు అని , దోపిడీని జనసేన అరికడుతుంది అని పవన్‌ ప్రకటించారు. అలాగే ‘అసెంబ్లీ నుంచి పారిపోవడం కాదు. ప్రశ్నించాలి!’ అంటూ జగన్ కి చురకలంటించారు చేశారు. నా కర్మ! ఒకే పెళ్ళి కుదరలేదు. నేనేం చేయను! ఒళ్లు పొగరెక్కి చేసుకోలేదు పెళ్లిళ్లు! నేను మీలాగా బలాదూర్‌ను కాదు’’ అంటూ విపక్ష నేత జగన్‌పై పవన్‌ కల్యాణ్‌ విరుచుకుపడ్డారు. ‘కార్లు మార్చినట్లు పెళ్లిళ్లు చేసుకున్నారు’ అంటూ కొన్నాళ్ల క్రితం జగన్‌ చేసిన విమర్శలపై తొలిసారిగా బహిరంగంగా స్పందించారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు అలవాటు. లోకేశ్‌ కూడా వెన్నుపోటుతో సీఎం కావాలనుకుంటే కుదరదు. మీరు వెన్నుపోటు పొడుస్తుంటే పొడిపించుకునేందుకు నేను ఎన్టీఆర్‌లా అమాయకుణ్ని కాదు. వెన్నుపోటు రాజకీయాలపై జనసైన్యం తిరగబడుతుంది అని తెలిపారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎవరుండాలి అనేది మీరే నిర్ణయించుకోండి...చంద్రబాబా, జగనా, నేనా...?అని ప్రజలకు పిలుపునిచ్చారు.

Related News