//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చెల్లెలు కవితకి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు..!

Category : politics

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు పార్లమెంట్‌లో నిరసన గళమెత్తిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా దీని గురించి లోక్‌సభలో మాట్లాడారు.

ఆంధ్రాకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని కేంద్రాన్ని కోరారు.ఇదిలా ఉండగా హామీల విషయంపై కేంద్రం మళ్లీ పాతమాటే చెబుతుండటంతో ఆంధ్రా నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కాగా తాజాగా కవితకు,జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కృతజ్ఞతలు తెలిపారు.పార్లమెంట్‌ వేదికగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలంటూ పవన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.'రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఏపీకి ఇచ్చిన హమీలను నెరవేర్చాలని లోక్‌సభలో మద్దతు తెలిపిన తెరాస ఎంపీ,చెల్లెలు కవిత గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు' అంటూ ట్వీట్‌ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.