//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జగన్ కామెంట్స్ పై పవన్ విన్నపం...!

Category : politics

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మొన్న ఏపీ బంద్ సందర్భంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా తీవ్రమైన విమర్శలు చేసారు. జగన్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కార్లని మార్చినంత సులువుగా పెళ్లాలని మార్చుతాడని అన్నాడు.

దీని పై స్పందించిన పవన్ కళ్యాణ్ అభిమానులు నిన్నటి నుండి జగన్ పై, అలాగే వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులతో సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఈ విషయం లో తమ అభిమానులకి పవన్ ఒక విన్నపం చేసారు.

నేను ఇంతవరకు రాజకీయంగా ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదు. ఎవరిని చేయనుకూడా. నేను ఎవరినైనా వారి ప్రజలకి లబ్ధ్ది చేకూరే పాలసీలల్లో లోటుపాట్లు ఉంటె వృత్తి పరంగా విమర్శిస్తాను. ఈతరుణం లో జగన్ మోహన్ రెడ్డి గారి ఇంటి ఆడపడుచులని వివాదంలోకి లాగవద్దు అని అందరిని వేడుకుంటున్నఅని, ఇక్కడి తో ఈ విషయాన్నీ వదిలేయాలని పవన్ విన్నపించారు.

Related News