//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇక పవన్ కళ్యాణ్ కూడా మొదలు పెట్టాడు..

Category : politics

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ణుకు పట్టణంలో బహిరంగ సభలో తన హామీల వర్షం కురిపించాడు. మహిళల భద్రత విషయంలో ఎక్కడా రాజీపడబోమని, ఆడబడుచులకు నగదు బదిలీ చేస్తామని, పేదలకు రూపాయి బియ్యం బదులు నిత్యావసరాలకి రూ. 2500 నుంచి రూ. 3500 ఇస్తామని హామీ ఇచ్చారు.

ఆడపడుచులను ఇబ్బంది పెట్టిన వాళ్ల తోలు తీస్తానని హెచ్చరించారు. అగ్రకులాల్లోని యువతకు ఈబీసీ హాస్టళ్లు ఏర్పాటు చేస్తామని, బీసీ కులాలకు చట్ట సభల్లో రిజర్వేషన్ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తానని చెప్పారు. జగన్ లక్ష కోట్లు దోచేస్తే, చంద్రబాబు లక్షన్నర కోట్లు దోచేసి, ప్రజాక్షేమాన్ని గాలికి వదిలేశారని పవన్ ఆరోపించారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా దోస్తే, టీడీపీ చట్టబద్ధంగా దోచిందని, భవిష్యత్తులో ఓటు వేసేటప్పుడు పిల్లల భవిష్యత్తును ఆలోచించాలని సూచించారు.

'దేవుడా రక్షించు నా దేశాన్ని... పెద్ద పులుల నుంచి, పెద్ద మనుషుల నుంచి...' అన్న ప్రముఖ కవి దేవరకొండ బాల గంగాధర్ తిలక్ రాసిన కవితను చదువుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. లక్షల కోట్ల అవినీతి జరుగకుండా ఉంటే, ఆడపడుచులకు నగదు బదిలీ, ఉచిత గ్యాస్ సిలిండర్ సాధ్యమేనని అన్నారు. చంద్రబాబు ఇస్తున్న రూపాయి బియ్యం కోళ్లకు దాణాగానూ, సారా బట్టీలకూ పోతున్నాయని, దాని బదులు మహిళల ఖాతాలో నెలకింతని డబ్బులు వేస్తే, నిత్యావసరాలకు నిజంగా ఉపయోగపడతాయని అన్నారు.

Related News