Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తానా సభల ఆహ్వానం పై...ఇరకాటం లో పడిన పవన్ కళ్యాణ్

Category : politics

రీసెంట్ గా జరిగిన ఏపి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన జనసేన పార్టీ. ఆ పార్టీని అన్ని విధాలా ముందుండి నడిపించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తానే స్వయంగా పోటీ చేసిన భీమవరం, గాజువాక నియోజక వర్గాల్లో పవన్ ఓడిపోవడం కూడా ఆ పార్టీ కి భారీ షాక్ తగిలింది.ఓ పార్టీ అధినేత హోదాలో ఓటమిని ఎదుర్కొన్న ఆయన....ఇక పూర్తి స్థాయి రాజకీయాలకే తన సమయాన్ని వెచ్చించ నున్నాడు.ఈ ఎన్నికల్లో ఓటమి నేర్పిన పాఠాల నుంచి తేరుకున్న ఆయన....రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జన సేన పార్టీని అన్ని విధాలుగా బలోపేతం చేసేందుకు సిద్ధం అయ్యాడు.అందులో భాగంగానే తమ పార్టీ మీటింగ్స్ ను వరుస పెట్టి నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయనకు తానా నుంచి ఇన్విటేషన్ వచ్చింది. జులై 4 నుంచి 6 వరకు వాషింగ్టన్ డీసీలో జరిగే తానా సభలకు పవన్ కళ్యాణ్ హాజరు కావాలంటూ జనసేనానికి ఆహ్వానాన్ని పంపారు.అయితే ఇదే విషయంపై అక్కడికి వెళ్లాలా....? వద్దా.....?

వద్దా అన్న విషయంపై పవన్ కల్యాణ్ ఎటు తేల్చుకోలేకపోతున్నట్లుగా తెలుస్తోంది.తానాలో చీఫ్ గెస్ట్ గా హాజరయ్యే విషయంపై ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన తానాకు ఆయన హజరుకావటం రానున్న రోజుల్లో నెగిటివ్ అవుతుందన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి.. అంతే కాకుండా టీడీపీతో అంతర్గతంగా చేసుకున్న ఒప్పందంలో భాగంగానే మొన్నటి ఎన్నికల బరిలోకి పవన్ ఒంటరిగా దిగారని.. ఈ నేపధ్యంలోనే వైసీపీ ఓటుబ్యాంకు ను చీల్చటమే లక్ష్యమన్న మాట వినిపించింది. ఈ ప్రచారం కూడా పవన్ కు తీవ్ర నష్టాన్ని కలిగించింది.ఇలాంటి సమయంలో..పవన్ తానా సభలకు వెళ్లటం అంత మంచిది కాదన్న మాట కూడా ఆ పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న మాట. ఈ సభలకు వెళ్లటం ద్వారా టీడీపీతో ఉన్న లోగుట్టు అనుబంధాన్ని తెర మీదకు తెచ్చినట్లు అవుతుందని కూడా ఆ పార్టీ నేతలు అధినేత తో చెబుతున్నారు. చూడాలి మరి ఇలాంటి పరిస్థతుల్లో పవన్ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటరన్నది.