Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెట‌ప్ మార్చేసాడు గాల్లో తేలిపోతున్న అభిమానులు..

Category : movies

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌స్తున్నాడా ? ఈయ‌న ఇంకో సినిమా చేయ‌బోతున్నాడా ? ఇప్పుడు ఇలాంటి ప్ర‌శ్న‌లెందుకు వ‌స్తున్నాయ్ అనుకుంటున్నారా? ఇప్పుడు పవన్ లుక్ చూసిన త‌ర్వాత ఈ డౌట్స్ వ‌స్తున్నాయ్ అంతే.నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు గ‌డ్డంతో మునిలా క‌నిపించిన ఈయ‌న‌ చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ హీరోగా మారిపోయాడు.

ఓ పాప‌తో దిగిన ఫోటో ఇప్పుడు బాగా వైర‌ల్ అవుతుంది.ఇందులో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గుర్తుకు రావ‌డం లేదు ఒక‌ప్పుడు సినిమా హీరో గుర్తుకొస్తున్నాడు.ట్రిమ్ చేసిన గడ్డం,టీ షర్టు,జీన్స్ ప్యాంటులో పవన్ కళ్యాణ్ గెటప్ చూసిన వారు కెవ్వు కేక అంటున్నారు. మరోవైపు మెగా బ్రదర్ నాగబాబు మాత్రం పవన్ కళ్యాణ్ నిర్మాతగా చిత్రలు తెరకెక్కిస్తుంటాడని చెప్పుకొచ్చారు.ఇప్పటికే రామ్ చరణ్ హీరోగా పవన్ కళ్యాణ్ ఒక సినిమా నిర్మించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ నడస్తోంది.మొత్తానికి పవన్ కళ్యాణ్ నటన పరంగా దూరమైనా నిర్మాతగా ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటాడన్న మాట.త‌ను సినిమాలు చేయ‌న‌ని మ‌ళ్లీ మ‌ళ్లీ చెబుతున్నా కూడా ఇప్పుడు లుక్ చూసిన త‌ర్వాత క‌చ్చితంగా ఏదో ఓ సినిమా అయితే క‌చ్చితంగా చేస్తాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కూడా ఈయ‌న కోసం ఓ క‌థ సిద్ధం చేస్తున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

అజ్ఞాత‌వాసి త‌ర్వాత ఈ ఇద్ద‌రి మ‌ధ్య అభిప్రాయబేధాలు వ‌చ్చాయంటూ వార్త‌లొచ్చాయి.కానీ తాము ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ మంచి స్నేహితుల‌మే అని ఆ మ‌ధ్య ఓ వేడుక‌లో నిరూపించారు ఈ ఇద్ద‌రు.ఇదిలా ఉంటే 2020లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ళ్లీ త్రివిక్ర‌మ్ తోనే రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నార‌ని తెలుస్తుంది.దానికి తోడు ప‌వ‌న్ సినిమా క‌చ్చితంగా ఉంటుంద‌ని మైత్రి మూవీ మేక‌ర్స్ కూడా క‌చ్చితంగా చెబుతున్నారు. అంటే క‌చ్చితంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను మ‌ళ్లీ సినిమాల్లో ఊహించొచ్చు.

పైగా ప‌వ‌న్ కూడా సినిమాల‌కు రిటైర్మెంట్ అయితే ఇవ్వ‌లేదు.బ్రేక్ ఇస్తున్నాన‌ని చెప్పాడంతే.కానీ ఈ మ‌ధ్య మాత్రం సినిమాల‌కు దూరంగా ఉంటాన‌ని చెప్పాడు.ఈ క‌న్ఫ్యూజ‌న్ లో అస‌లు ఈయ‌న సినిమాలు చేస్తాడా చేయ‌డా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.మొత్తానికి ఈ కొత్త లుక్ సినిమాల‌కే సంకేతం అవుతుందేమో చూడాలిక‌.