Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నంద్యాల పర్యటనలో జనసేనుడు....?

Category : state politics

ఏపీ ఎన్నికల పోలింగ్ తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తొలిసారి ప్రజా క్షేత్రంలోకి రానున్నారు. ఎన్నికల ప్రచారం ముగింపు దశలోనే కాస్త అనారోగ్యానికి గురైన పవన్ కల్యాణ్ ఎన్నికలు పూర్తయ్యాక కాస్త విరామం తీసుకున్నారు. ఈ ఎన్నికల హడావిడి ముగియడంతో కాస్త విశ్రాంతి తీసుకున్నారు. తాజాగా ఆయన నేడు కడప జిల్లాలోనీ నంద్యాలలో పర్యటించనున్నారు. ఇటీవల కన్నుమూసిన నంద్యాల ఎంపీ, జనసేన నేత ఎస్పీవై రెడ్డికి నివాళులు అర్పించనున్నారు పవన్ కల్యాణ్. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.

ఎస్‌.పీ.వై రెడ్డి మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున నంద్యాల నుంచి పోటీచేశారు. ఎస్పీవై రెడ్డి పలు పార్టీలు మారినా ప్రజల్లో ఆయనకు మంచి ఇమేజ్ ఉంది. పారిశ్రామిక వేత్తగా ఉండగానే ఆయన ఎన్నో సేవాకార్యక్రమాలు చేసి జనం గుండెల్లో నిలిచిపోయారు. నంద్యాల టూర్ ద్వారా మళ్లీ యాక్టివ్ అవుతున్న పవన్ కల్యాణ్.. ఆ తర్వాత జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై దృష్టి సారించే అవకాశం ఉన్నట్టు స్పష్టం అవుతుంది.అలాగే ఆ పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవడం కోసం .. నిరంతరం జనం మధ్యే ఉండే కార్యక్రమాలు రూపొందించుకోవడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసే ఆలోచనలో ఆయన ఉన్నారు.

అలాగే మే 23 న వెలువడ నున్న ఎన్నికల ఫలితాల ఆధారంగా జనసేన పార్టీ యెక్క భవిషత్తు కార్యాచరణ ఉండబోతుంది. ఏ లెక్కన చూసుకున్న ఆ పార్టీకి రాబోయే సీట్ల ఆధారంగానే ఆ పార్టీ యెక్క బలా బలాలు ఆధార పడి ఉన్నాయి.ఇప్పటికే ఏపి రాజకీయాల్లో జనసేన పార్టీ పై భారీ అంచనాలే నెలకొన్నాయి.ఆ పార్టీ గెలవబోయే సీట్ల సంఖ్యను బట్టి జనసేనుడి స్టామినా తెలియ బోతుంధి.ఎన్నికలు ముగిసినప్పటికీ ఆ పార్టీ , పోటీ అభ్యర్థులు సైతం ప్రజా క్షేత్రంలో ఉంటూనే ప్రజా సమస్యల పై నిత్యం పోరాడుతూ ఉండడం కూడా. ఆపార్టీకి. కలిసొచ్చే అంశాలు. ఎన్నికలు ముగిశాయి కదా అని చేతులు దులుపుకోకుండ....? ఆ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తూ ఉండడం కూడా ఏపిలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి ఎక్కువ మేలు జరిగే అవకాశాలు భారీగా కనిపిస్తున్నాయి.చూడాలి మరి ఏం జరుగుతుంది అన్నది.

Related News