//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వామపక్షాలతో పవన్ నడవగలరా..?

Category : politics

దేశంలో కమ్యునిజానికి కాలం చెల్లింది..దేశంలో కమ్యునిస్టుల వెనుక నడిచే వారు చాలా తక్కువ..ఒకప్పటిలా కమ్యునిస్ట్ రాజకీయాల్లో నిజాయితి కొరవడింది. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు... కమ్యునిస్ట్ పార్టీల నుంచి బయటకు వచ్చిన వారే. ఒకప్పటి కమ్యునిజం వేరు ఇప్పటి కమ్యునిజం వేరు...వారు ఉద్యమాలు చేసినా మరొకటి చేసినా ఇప్పుడు వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు అనేది వారి వాదన. అందుకే పార్టీలు మారిపోతున్నాం అని చెప్తున్నారు.

మరి అలాంటి వారితో ఒక సుధీర్గ ప్రణాళిక సిద్డం చేసుకుంటాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ నడిచి విజయం సాధించగాలరా..? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధానంగా వినపడుతున్న ప్రశ్న ఇది. గత ఎన్నికల సమయంలో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్..అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ నిర్మాణంపై ఏమాత్రం దృష్టి పెట్టకుండా కేవలం ఉభయ కమ్యునిస్ట్ పార్టీలతో కలిసి రాజకీయం చేస్తున్నారు. వారు పవన్ ద్వారా కొత్త గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.

కాని పవన్ ఇలాగే అయితే సుధీర్గ కాలం రాజకీయాలు చెయ్యలేరు. ఇది వాస్తవం.. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నిర్మాణం జరగాలంటే కచ్చితంగా మరొక పార్టీ సహకారం తీసుకోకూడదు. అలా జరిగితే అది దెబ్బ కొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అసలు రాజకీయ అనుభవం ఏమాత్రం లేని పవన్ కళ్యాణ్ ఇలా వారి సహకారం తీసుకుని ఉద్యమాలు పర్యటనలు చెయ్యడం నిజంగా హాస్యాస్పదం. ప్రత్యేక హోదా ఉద్యమంలో పవన్ చేసిన పాదయాత్రకు వచ్చింది ఎక్కువగా కమ్యునిస్ట్ కార్యకర్తలే..వారి జెండాలే ఎక్కువగా కనపడ్డాయి కూడా.. కాబట్టి పవన్ వారితో కాకుండా సొంతగా పార్టీ నిర్మాణం చేపడితేనే జనసేన అనే పార్టీ బ్రతికే అవకాశం ఉంది.

Related News