Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నన్ను నలుగురు మోసే దాకా మీతోనే ఉంటా ...ఇక సినిమాలకు సెలవు అంటూ పవన్ కళ్యాణ్

Category : movies

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో నిలవ గలడ అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో నెలకొన్నది.అయితే ఇదే ప్రశ్న కి జీవం పోస్తూ మొన్న జరిగిన ఏపి ఎన్నికల్లో ఆయన స్థాపించిన జనసేన పార్టీ ఘోరమైన ఓటమి నీ చవి చూసింది.అయితే ఈ నేపధ్యంలోనే ఆయన రాజకీయ భవిషత్తు పై ప్రతి ఒక్కరిలోనూ అనేక అనుమానాలు కలుగాయి. అయితే సమయంలో ఆయన తన అన్న చిరంజీవి లాగే చాప చుట్టేయ బోతున్నరన్న ప్రచారం కూడా విపరీతంగా సాగుతోంది. ఇటు వంటి సమయంలోనే ఓ ప్రజా నాయకుడిగా తనకు ప్రజలు అప్పగించిన ఈ బాధ్యతను తాను నిర్వర్తించేందుకు మరింత కష్ట పడి సాధిస్తనని చెప్పడం విశేషం. ఎన్నికల ఫలితాల అనంతరం తమకు ఓట్లు వేసిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పడం కోసం తాజగా గుంటూరు జిల్లాలో ఓ బహిరంగ సభ ఏర్పాటు చేసిన జనసేనా నాయకుడు.

ఈ ఎన్నికలలో తమకు ఆశించిన సీట్లు రాకపోయినా....తమకు ఓటు వేసి తమ మద్దతు ప్రకటించిన ప్రతి ఒక ఓటర్ కి తమ పార్టీ తరుపున తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని.ఈ ఓటమి భారంతో తమ పార్టీ కృంగి పోబోధని.తమ పార్టీ ఓటమి తమలో మరింత బాధ్యతను గుర్తు చేసిందని.తన కట్టె కాలేవరకూ ప్రజల్లోనే ఉంటా.. ప్రజలతోనే ఉంటా నని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.కేవలం ఎన్నికల ముందు అధికారమే లక్ష్యంగా ఓట్లు అడగడానికి వచ్చిన పార్టీ తమది కాదని. జనాసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఇక పైన కూడా యువత కు పాతిక సంవత్సరాల భవిష్యత్తే లక్ష్యంగా తమ పార్టీ కార్యాచరణ ఉందనుందని. ఓటమి వచ్చినంత మాత్రాన తామే వెనక్కి తగ్గబోమని...ఓటమి అనేది తనకేమీ కొత్త కాదని.... ఎత్తు పల్లాలు చూసి జడవని ఎన్ని ఓటములనైన ప్రజల కోసం తట్టుకొని నిలబడతానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

అంతే కాకుండా తన పై వస్తున్న అవాస్తవాలని ఆయన ఖండించారు.తాను తిరిగి సినిమాల్లోకి వెళతానని వస్తున్న వార్తల్లో నిజం లేదని.నేను తిరిగి సినిమాల్లోకి వెళ్లేందుకు రాజకీయాల్లోకి రాలేదనీ ఆయన చెప్పుకొచ్చారు. అవసరమైతే ప్రజల కోసం తాను ఒక్కడ్నే.. ఒక్కడ్నే.. కూర్చుంటాననీ. మార్పు ఎందుకు రాదో చూస్తాననీ ....ఎందుకు జనసేన ప్రభుత్వాన్ని స్థాపించలేమో రానున్న రోజుల్లో చేసి చూపిస్తాననీ. అరె....ఇంత మాత్రం కసి.. ఇంతమాత్రం పౌరుషం లేకపోతే రాజకీయాల్లోకి తాను ఎందుకు వస్తాననీ.ఇక్కడే నిలబడటానికి, జనసెనా జెండా పాతడానికి, జెండా ఎగరేయడానికే వచ్చానని ఎగరేసి తీరుతాననీ.. రాజకీయాల్లోనే ఉంటాననీ..! సినిమాలు చేయ బొనని పవన్ కళ్యాణ్ ఎంతో ఉద్వేగంగా చెప్పుకొచ్చారు.అంతే కాకుండా తన సినిమా భవిషత్తు పై కూడా అసలు నిజాన్ని బయట పెట్టాడు.

Related News