//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్నికల టెన్షన్ ఎందుకు దండగ .. గోమాత ఉండగా అంటున్న పవన్ కళ్యాణ్

Category : politics state

ఒకపక్క ఏపీలో రానున్న ఎన్నికల నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రధాన పార్టీలు పోటాపోటీగా అభ్యర్థులను ప్రకటించడమే కాకుండా, వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం పంటలు మన సంస్కృతిలో భాగం అంటూ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో గోమాతలకు మేత వేసి వాటిని ఆలనాపాలనా చూస్తున్నారు.

ప్రకృతిని, పాడి పశువులను ప్రేమించే జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ కు సమయం ఉన్నప్పుడల్లా వ్యవసాయం చేస్తారు, రైతు జీవితం... పాడి, పంట కలనేత అని చెబుతారు జనసేనాని. వీలు చిక్కినప్పుడల్లా స్వయంగా అటు వ్యవసాయం చేస్తారు. ఇటు గోవులకు సేవ చేస్తూ ఉంటారు. అందుకే పార్టీ మూల సిద్ధాంతాలలో ‘సంస్కృతుల్ని కాపాడే సమాజం’ అంటూ వాటికి పెద్ద పీట వేశారు.

ఇక అసలు విషయానికి వస్తే మంగళగిరి లోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా గోశాల ఏర్పాటు చేశారు. దీంతో జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయానికి చేరుకోగానే గోమాతలకు మేత వేసి వాటి ఆలనాపాలన గురించి వాకబు చేశారు. ఒకపక్క మిగతా పార్టీలన్నీ దూకుడు పెంచి జెట్ స్పీడ్ తో ముందుకు వెళుతుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం చాలా ప్రశాంతంగా ఎలాంటి టెన్షన్ లేకుండా ఎన్నికలకు వెళుతున్నారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.

Related News